యువీ చెక్కిన విధ్వంసం రికార్డులను బ్రేక్ చేసిన అభిషేక్…!
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతం చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతం చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. బంతుల పరంగా రికార్డు చూస్తే కేవలం 2,898 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకుని, ఆండ్రీ రస్సెల్ కార్డును బద్దలు కొట్టాడు.
అభిషేక్ ప్రతి 9.3 బంతులకు ఒక సిక్సర్ బాదుతున్నాడు. ఇది క్రిస్ గేల్ 9.5 బంతులకు ఒకటి కంటే మెరుగైన గణాంకంగా నిలిచింది. అంతే కాదు తన గురువు, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా అభిషేక్ ఇప్పటికే అధిగమించాడు.ప్రస్తుతం అభిషేక్ 171.65 స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 8 టీ20 సెంచరీలు సాధించిన అభిషేక్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.











