కోర్టుకు చేరిన జానీ మాస్టర్ వ్యవహారం, బెయిల్ వస్తుందా…?

జానీ మాస్టర్ కేసులో పోలీసులు వేగం పెంచారు. నేడు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Post Published By: Vencateshg
Updated : 23 September 2024, 9:59 AM IST

జానీ మాస్టర్ కేసులో పోలీసులు వేగం పెంచారు. నేడు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజులు పాటు జానీ మాస్టర్ ను కస్టడీకి నార్సింగి పోలీసులు కోరారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ ను జానీ మాస్టర్ న్యాయవాది దాఖలు చేసే అవకాశం కనపడుతోంది. కస్టడీలో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఇప్పటికే రిమాండ్ రిపోర్టులో తన తప్పును ఒప్పుకున్న జానీ మాస్టర్...పలు కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. రీమాండ్ రిపోర్ట్ లో జానీ మాస్టర్ భార్య అయేషా బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనపడుతోంది. అటు బాధితురాలికి పోలీసులు భద్రత కల్పించారు.

Published : 
  • 23 September 2024, 9:59 AM IST