ఏపీలో వ్యవస్థలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో.... ఎంత నీచాతి నీచంగా పనిచేస్తాయో.... కాదంబరీ జత్వాని వ్యవహారం బయట పెట్టింది. ప్రభుత్వం, పోలీసులు, మీడియా, లీడర్లు.... రాజకీయాల కోసం, ప్రత్యర్థుల్ని బ్రష్టు పట్టించడానికి ఉమ్మడిగా ఎలా దిగజారుతాయో జత్వాని కేసే ఒక ఉదాహరణ. షిప్పింగ్ వ్యాపారవేత్త, వైసీపీ నేత కుక్కలు నాగేశ్వరావు కొడుకు విద్యాసాగర్ దగ్గర జత్వనీ అనే ముంబై యువతి, హాని ట్రాప్ చేసి కోటి 32 లక్షల రూపాయలు వసూలు చేసిందని సిఐడి చార్జిషీట్ లో స్పష్టంగా పేర్కొంది. కొన్ని నెలల క్రితం ఏపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, పోలీసులు ఇదే కాదంబరీ జత్వానిని ఒక మహోన్నతురాలుగా కీర్తిస్తూ, విలువలకు పట్టం కట్టే మహిళగా భావిస్తూ.... ఆమెని స్పెషల్ ఫ్లైట్లో ఏపీకి తీసుకొచ్చారు. వైసీపీ హయాంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు... సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, క్రాంతి రానా టాటా లు విద్యాసాగర్ ఫిర్యాదు పై ఆమెను ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని, హింసించారని గెస్ట్ హౌస్ లో ఆమెని ఆమె కుటుంబాన్ని నిర్బంధించారని, అన్యాయంగా జైల్లో పెట్టారని.... కూటమి ప్రభుత్వమే ఆరోపిస్తూ జత్వానికి న్యాయం చేయడానికి రంగులోకి దిగింది.
హోం మంత్రి అనిత నేను ఉన్నాను.... నేను విన్నాను అంటూ జత్వానిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. జగన్ అండ్ కో చేసినా అరాచకాలలో కదంబరీ జత్వాన్ని కేసు ఒకటిని చెప్తూ, ఆమెకు ప్రోటోకాల్ దర్శనాలు చేయించారు. సీఎం చంద్రబాబు నాయుడు జత్వాన్ని లాంటి మహిమాన్విత పుణ్య స్త్రీని ఇలా చేస్తారా అంటూ పిడికిలి బిగించి, పళ్ళు నూరి, గుడ్లు ఉరిమి ఆనాటి జగన్ సర్కార్ అరాచకాల్ని ఎండగట్టారు. మొత్తానికి జగన్ ప్రభుత్వంలో పోలీసులు ఎలా చెలరేగి పోయారో వివరిస్తూ టిడిపి జత్వానీ అంశాన్ని పుష్కలంగా తన రాజకీయానికి వాడుకుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేసి , వాళ్లపై కేసులు పెట్టి మాజీ సీఎం జగన్ తో అంట కాగితే ఇలాగే ఉంటుందని ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక ఎల్లో మీడియా అయితే చెప్పనక్కర్లేదు.
ఎల్లో చానల్స్, పేపర్స్ చెలరేగి పోయాయి. కాదంబరి జత్వానితో కన్నీళ్లు పెట్టిస్తారా... ?ఆమె ఆవేదనకి మేం పరిహారం తీర్చుకుంటాం అంటూ రకరకాల కథనాలు వండి మార్చారు. ఆమె కోసం ఎల్లో స్టూడియోలు దద్దరిల్లిపోయాయి. జత్వాన్ని లాంటి ఉన్నత మహిళకు ఇంత అన్యాయం జరిగితే .. ఎవరు ప్రశ్నించరు ఏంటి అని టీవీ స్టూడియోలో ఎల్లో యాంకర్లు గర్జించారు. గుండెలు బాదుకున్నారు. పరమోన్నత జర్నలిస్టులుగా... కాదంబరి జత్వాన్ని కి మేమున్నామంటూ పిడికిలి బిగించారు. జగన్ ఎన్ని దారుణాలకు ఒడిగెట్టాడో కన్నీళ్ళతో వివరించారు. దీంతో
దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా జనం జగన్ని చేదరించుకున్నారు. జత్వాన్ని లాంటి మహా ప్రతివతకి ఇంత అన్యాయం చేస్తారా అని ఛీ కొట్టారు. ఏపీ సర్కార్, మీడియా రెండు కలిసి ఒక కొత్త కొత్త స్టోరీ లు అల్లి ముగ్గురు ఐపీఎస్ లను ఇంటికి పంపించారు.
కానీ అక్కడితో కథ అయిపోలేదు. నాలుగు రోజుల క్రితం సిఐడి ఒక చార్జీ షీట్ వేసింది. దానిలో కాదంబరీ జాత్వాన్ని..... కుక్కల విద్యాసాగర్ నుంచి కోటి 32 లక్షలు డబ్బు గుంజిందని, బ్లాక్మెయిలింగ్ చేసిందని, ఇది హాని ట్రాప్ కేస్ అని స్పష్టంగా పేర్కొన్నారు ఏపీ పోలీసులు. జనం అంతా షాక్ అయిపోయారు. ఇదేంటి జత్వాన్ని అమాయకురాలని, ఆమెని ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చారని, కుక్కల విద్యాసాగర ఆమెని మోసం చేశాడని మేమంతా ఆల్రెడీ నమ్మేసి... ఒక డిసిషన్ కి వచ్చేసాక ఏపీ సర్కారీ పోలీసులే ఇలా స్వయంగా రివర్స్ చార్ షీట్ వేయడం ఏంటని జనం ఆశ్చర్యపోతున్నారు. జనం సంగతి అలా ఉంచండి... కొన్ని మీడియా సంస్థలు కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా గిలగిలా కొట్టు కుంటున్నాయి. మేము ఇంత కష్టపడి జత్వానిని మహా ప్రతివతగా, జగన్ సర్కార్ ఆకృత్యాలకు బలైపోయిన దీన మహిళగా తీర్చిదిద్దితే.... మన చంద్రబాబు సర్కారే ఇలా అడ్డం తిరిగి మన మీడియా తీర్పుకి వ్యతిరేకంగా చేసింది ఏంటి అని జుట్టు పీక్కుంటున్నారు. జనానికి ఇప్పుడు పిక్చర్ స్పష్టంగా అర్థం అవుతుంది. ఓరి నికృష్టులారా ఇంతకు తెగిస్తారా? మీ రాజకీయాల కోసం... మీ చిల్లర కోసం... ఎవరినైనా బ్రస్టు పట్టిస్తారా? అని తిడుతున్నారు.
అయితే ఇదంతా మీకు ఆన్ స్క్రీన్ పై కనిపించే స్టోరీ. దీని వెనక అసలు స్టోరీ ఉంది. అదే జిందాల్ స్టోరీ. పొలిటీషియన్సు... పారిశ్రామికవేత్తలు ఒక కొమ్మకు పూచిన రెమ్మలాంటోళ్ళని.... వాళ్ల అవసరాల కోసం వ్యవస్థల్ని ఎలాగైనా బ్రష్టు పట్టిస్తారని... ఫైనల్ గా మీడియా వాళ్ళను కూడా జోకర్లను చేస్తారని నిరూపించింది ఈ జిందాల్ స్టోర్. కాదంబరి జత్వాన్ని ముంబై లో జిందాల్ తో కొన్నేళ్ల క్రితం వ్యవహారం నడిపింది. ఆ తర్వాత జిందాల్ ని బెదిరించింది. మరోవైపు కుక్కల విద్యాసాగర్ తో కూడా వ్యవహారం నడిచింది. ముంబైలో ఏర్పడిన పరిచయంతో కుక్కల విద్యాసాగర్ కోట్ల రూపాయల లో జత్వానికి టాక్స్ కట్టేశాడు. డబ్బు తిన్నాక కూడా విద్యాసాగర్ ను ఆమె ఇంకా బ్లాక్ మెయిల్ చేయడంతో జత్వానిపై కేసు పెట్టాడు. ఇది తెలిసి జిందాల్ తెలివిగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ని జత్వానీ చేసిన మోసం గురించి చెబుతూ... ఏపీలోనే ఆమె సంగతి తేల్చాలని కోరాడు.
విద్యాసాగరు కేసు నీ అడ్డంపెట్టి జిందాల్ జత్వానిపై పగ తీర్చుకున్నాడు. అక్కడ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు జత్వాన్ని నీ ఎత్తుకొచ్చింది విద్యాసాగర్ కేస్ కోసం కాదు, జిందాల్ అనుగ్రహం కోసం. ప్రభుత్వం మారిన తర్వాత , జత్వాని వ్యవహారాన్ని ఎల్లో మీడియా ఫుల్ గా వాడేసుకుంది. ఎవరికి ఇష్టమైన స్క్రిప్ట్ ని వాళ్ళు రాసేసుకున్నారు. ఈమధ్య ఓ పది రోజుల క్రితం కడపలో జిందాల్ స్టీల్ ఏర్పాటు సందర్భంగా జిందాల్ ఏపీ ప్రభుత్వ అధినేతలను కలిశాడు. జత్వాని మోసాలపై విషయం మొత్తం చెప్పాడు. ఇప్పుడు జగన్ కంటే, మీడియా కంటే జిందాల్ తో స్నేహం చంద్రబాబుకి ముఖ్యం. అందుకే జిందాల్ ఆదేశాలతో అసలు నిజాన్ని , కాదంబరి జత్వాని వ్యవహారాల గురించి చార్జ్ షీట్ గా సిఐడి కోర్టు ముందు పెట్టింది. ఫైనల్ గా ఈ గేమ్ లో జిందాల్ గెలిచాడు. తెలుగు మీడియా ఓడింది. చిత్రమైన విషయం ఏంటంటే జిందాల్ ఆదేశాల్ని అప్పుడు జగన్... ఇప్పుడు చంద్రబాబు ఇద్దరూ తూచా తప్పకుండా పాటించి ఆయనకి న్యాయం చేశారు. అందుకే కడప నుంచి వెళుతూ వెళుతూ... జగన్ కి ట్వీట్ చేసి థాంక్స్ చెప్పి వెళ్ళాడు జిందాల్.
జత్వాని బ్లాక్ మెయిలర్ అని చెప్పిన చార్జిషీట్ వార్తని జగన్ మీడియా సాక్షి వెయ్యలేదు. చంద్రబాబు మీడియా అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. జత్వానికోసం కన్నీళ్లు పెట్టిన హోం మంత్రి అనిత ఇప్పుడు నోరు మెదపడం లేదు. కదంబరి జత్వాన్ని గురించి గుండెలు బాదుకున్న చంద్రబాబు కూడా అసలు ఆమె ఎవరో తెలియదు అన్నట్లుగా ఉన్నారు. పోనీ జగనన్న అండ్ కో అయినా మాట్లాడతారా అంటే... వాళ్లు నోటి మీద వేలు వేసుకొని దిక్కులు చూస్తున్నారు . ఈ ఓవరాల్ జిందాల్ జత్వాన్ని వ్యవహారంలో తేలింది ఏమిటంటే.... వాళ్లు వాళ్లు ఒక్కటే.. ఫైనల్ గా మీడియా వాళ్లే పూల్స్.... అయ్యారు. మీడియా వాళ్లంతా ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఎవరికి వాళ్లే లోలోపల పిసుకుంటున్నారు. మమ్మల్ని ఇలా ముంచేశారు ఏంట్రా అని జుట్టు పీక్కుంటున్నారు. మీడియా వాళ్ళని చూసి జనం నవ్వుకుంటున్నారు. తెలుగు మీడియా క్రెడిబిలిటీ ఎప్పుడో గంగలో కలిసింది. ఇప్పుడు దాని గురించి చర్చ అవసరం లేదు. కాకపోతే పొలిటీషియన్లు ఇండస్ట్లిస్టులు ఆడే ఆటలు మధ్య మీడియా వాళ్ళు బఫూన్లని, జోకర్లని జత్వాని వ్యవహారం నిరూపించింది. బహుశా తెలుగు మీడియా చరిత్రలోనే ఇదొక పెద్ద హిస్టారికల్ లెసన్.