ప్లీజ్ ఆపండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్

నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ తర్వాత బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ కాలేజీపై చర్యలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.

Post Published By: Vencateshg
Updated : 25 August 2024, 12:04 PM IST

నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ తర్వాత బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ కాలేజీపై చర్యలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అడ్డుకునేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్ట్ కి వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడారు. అనురాగ్ యూనివర్సిటీ ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో లేదు అని ఆయన స్పష్టం చేసారు.

బఫర్ జోన్ లో ఉంటే నేనే దగ్గర ఉండి కూలగొడుతాను అన్నారు పల్లా. ఎక్కడైనా తప్పు జరిగితే చెప్పండి...నోటీసులు ఇవ్వండి అని ఆయన కోరారు. అంతేగాని రాత్రికి రాత్రి వచ్చి కూలగొడుతాము అంటే ఎలా అని నిలదీశారు. మెడికల్ కాలేజీలో అనేక ఎక్యుమెంట్స్ ఉన్నాయి అని కూల్చవద్దు అని కోరారు. గత 9 నెలల నుండి నా పై అనేక దాడులు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు ఆయన.

Published : 
  • 25 August 2024, 12:04 PM IST