రణవీర్ సింగ్ మరియు డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ "ధురంధర్" ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో 'యాలినా' అనే కీలక పాత్ర కోసం ఎంపికైన నటి గురించి ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇద్దరు "సారాల" మధ్య జరిగిన పోటీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ ప్రాజెక్టులో రణవీర్ సింగ్‌కు జోడీగా సారా అర్జున్ యాక్టింగ్ తో అదరగొట్టింది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'నాన్న', 'పొన్నియిన్ సెల్వన్' వంటి సినిమాలతో మెప్పించిన ఈమె, ఇప్పుడు హీరోయిన్‌గా తన టాలెంట్ ఏంటో వందశాతం నిరూపించుకుంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ 'యాలినా' పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ కూడా ఆసక్తి కనబరిచినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా మరియు దర్శకుడు ఆదిత్య ధర్ సరైన నటిని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని పేరుంది.
సారా అలీ ఖాన్ ఇప్పటికే స్టార్ హోదాను కలిగి ఉన్నప్పటికీ, కథకు అవసరమైన సహజత్వం మరియు ఫ్రెష్‌నెస్ కోసం వారు సారా అర్జున్‌ను ఎంచుకున్నారని టాక్.సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ, "సరైన పాత్రకు సరైన సారా అర్జున్ ను ఎంచుకున్నందుకు ముఖేష్ ఛాబ్రా మరియు ఆదిత్య ధర్‌లకు అభినందనలు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సారా అర్జున్ తన సహజమైన నటనతో ఈ పాత్రకు నిండుదనం తీసుకువచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.ఒకవైపు గ్లామర్ మరియు స్టార్ ఇమేజ్ ఉన్న సారా అలీ ఖాన్, మరోవైపు టాలెంట్ మరియు ఫేస్ వాల్యూ ఉన్న సారా అర్జున్.. వీరిద్దరిలో మేకర్స్ సారా అర్జున్‌కే మొగ్గు చూపడం చూస్తుంటే, ఆదిత్య ధర్, తన మూవీ సక్సెస్ ను ఎంతగా గెస్‌చేశారో అర్థమవుతోంది.