భవిష్యత్తు అంతా మీదే యువక్రికెటర్లపై సచిన్ ప్రశంసలు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్రలపై ప్రశంసలు కురిపించాడు. బెంగళూరు టెస్టులో వీరిద్దరూ శతకాలు సాధించారు.

Post Published By: Vencateshg
Updated : 20 October 2024, 1:34 PM IST

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్రలపై ప్రశంసలు కురిపించాడు. బెంగళూరు టెస్టులో వీరిద్దరూ శతకాలు సాధించారు. దీంతో ఈ యువ ఆటగాళ్ళను అభినందిస్తూ సచిన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. మనం మన మూలాలతో కనెక్ట్ అవ్వడానికి క్రికెట్ ఓ మార్గమని, దీనికి రచిన్ రవీంద్రే చక్కని ఉదాహరణ అంటూ రాసుకొచ్చాడు. అతని కుటుంబం బెంగళూరు నుంచే వెళ్లిందన్న విషయాన్ని సచిన్ గుర్తు చేశాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ కూడా గుర్తుండిపోతుందన్న సచిన్ భారత్‌కు కావాల్సిన సమయంలో అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడంటూ ప్రశంసించాడు. వీరిద్దరికీ భవిష్యత్తులో మరిన్ని మంచి రోజులు ఉన్నాయంటూ రాసుకొచ్చాడు.

Published : 
  • 20 October 2024, 1:34 PM IST