The meetings of the Congress Working Committee CWC will begin shortly at the Taj Krishna Hotel in Hyderabad Corrupt Working Committee written on those posters
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం.. ఏం రాశారో తెలుసా ?
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు కొద్దిసేపట్లో హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో ప్రారంభం కానున్నాయి. ఈ మీటింగ్స్ లో సోనియాగాంధీ సహా కీలక కాంగ్రెస్ నేతలు పాల్గొనబోతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు హైదరాబాద్ సిటీ లోని కొన్ని ప్రాంతాల్లో వెలిశాయి.
‘‘కరప్ట్ వర్కింగ్ కమిటీ” అని ఆ పోస్టర్లపై రాతలు. పోస్టర్లపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలను ప్రచురించారు. వారు కొన్ని స్కామ్ లు చేశారనే ఆరోపణలను కూడా ఆ పోస్టర్లపై ముద్రించడం గమనార్హం. సిటీ లో వెలసిన ఈ పోస్టర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుండటాన్ని జీర్ణించుకోలేక కొన్ని పార్టీలు ఇలా దుష్ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ ను ధైర్యంగా ఎదుర్కోలేని పిరికి పందలు.. దొంగచాటుగా ఈ పోస్టర్లను అంటించారు చెబుతున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పోస్టర్ లో ఉన్న కాంగ్రెస్ నేతల పేర్లు, ప్రస్తావించిన స్కాముల వివరాలివీ..
