Karnataka Teacher And Student : ఇదేం టీచర్ రా బాబు ! కుర్రాడి జీవితం నాశనం చేసింది..

రోజులు మారిపోతున్నాయి. ఇంటర్నెట్ యుగంలో టీచర్లు- స్టూడెంట్స్ బంధాలు దారి తప్పుతున్నాయి. టీచర్లు స్టూడెంట్లతో అఫైర్స్ పెట్టుకునే దారుణ పరిస్థితులు మొదలయ్యాయి. కర్ణాటకలో ఓ ఇంటర్ విద్యార్థి, టీచర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 January 2024, 3:21 PM IST

రోజులు మారిపోతున్నాయి. ఇంటర్నెట్ యుగంలో టీచర్లు- స్టూడెంట్స్ బంధాలు దారి తప్పుతున్నాయి. టీచర్లు స్టూడెంట్లతో అఫైర్స్ పెట్టుకునే దారుణ పరిస్థితులు మొదలయ్యాయి. కర్ణాటకలో ఓ ఇంటర్ విద్యార్థి, టీచర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్.

కర్ణాటక చింతామణిలో ప్రధానోపాధ్యాయురాలు ఆ స్కూల్లో మైనర్ విద్యార్థి అభ్యంతరకరంగా, సన్నిహితంగా ఉన్న ఫోటోలు సంచలనంగా మారాయి. చింతామణిలోని ఓ స్కూల్ విద్యార్థులు టూర్ కి వెళ్లారు. అక్కడ టీచర్ కం హెడ్ మిస్ పుష్పలత.. మైనర్ విద్యార్థితో చాలా సన్నిహితంగా మెలిగారు. కొత్త జంట లాగా వాళ్ళిద్దరూ ఫోటో షూట్ చేయించుకున్నారు. అనుకోకుండా ఆమె ఫోన్ నుంచి వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక దర్యాప్తు జరిపిన అధికారులు.. ప్రధానోపాధ్యాయురాలు పుష్పలతను సస్పెండ్ చేశారు. ఆ స్టూడెంట్ తో పుష్పలత టీచర్ చెట్టా పట్టాలేసుకొని తిరగడం చాలా రోజులుగా జరుగుతున్న వ్యవహారమేనని.. ఆ 17 ఏళ్ల విద్యార్థి.. తరచూ పుష్పలత మేడమ్ ఇంటికి వెళ్లి వస్తూ ఉంటాడని స్కూల్లో మిగిలిన స్టూడెంట్స్ చెప్పారు. దాంతో అసలు బండారం బయటపండి.

కానీ పుష్పలత వాదన మాత్రం మరోలా ఉంది. తామిద్దరం స్నేహితులం అని ఒకసారి, ఇద్దరిదీ తల్లీ కొడుకుల సంబంధం అని మరోసారి.. ఇలా రకరకాలుగా వివరణ ఇస్తోంది. స్నేహం అయితే ఇలా ఒకరినొకరు అల్లుకు పోయి.. కింద మీద పడి ఫోటోలు దిగుతారా అని అధికారులు పుష్పలతను నిలదీశారు. ఆమెని సస్పెండ్ చేసి ఇంటికి పంపారు. కానీ టీచర్ చేసిన నిర్వాకానికి ఆ మైనర్ స్టూడెంట్ ఫ్యూచర్ నాశనమైంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవడంతో.. పుష్పలతతో పాటు.. స్టూడెంట్ పరువు కూడా పోయింది. గురు శిష్యుల సంబంధానికి మచ్చ తెచ్చిందని మండిపడుతున్నారు తల్లిదండ్రులు.

Published : 
  • 11 January 2024, 3:21 PM IST