Top story: కర్ణాటక కాలేజీల్లో కలకలం జెన్ జీ యువతలో పెరుగుతున్న మహమ్మారి.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం ఏంటీ షాకింగ్ రిపోర్ట్..?

ఈ వార్త దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులను, విద్యావ్యవస్థను ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేస్తోంది. చదువుకుని దేశ భవిష్యత్తును మార్చాల్సిన నేటి తరం యువత.. ఒక ప్రాణాంతక మహమ్మారి బారిన పడుతోందా?

Post Published By: dialnews
Updated : 31 July 2026, 10:51 AM IST

ఈ వార్త దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులను, విద్యావ్యవస్థను ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేస్తోంది. చదువుకుని దేశ భవిష్యత్తును మార్చాల్సిన నేటి తరం యువత.. ఒక ప్రాణాంతక మహమ్మారి బారిన పడుతోందా? అవును, తాజాగా పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి వచ్చిన ఒక నివేదిక ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ఏకంగా 7,000 మందికి పైగా కాలేజీ విద్యార్థులు హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. అసలు ఐటీ హబ్‌గా, చదువుల నిలయంగా ఉన్న కర్ణాటకలో ఇంత పెద్ద ఎత్తున యువతకు ఈ వ్యాధి ఎలా సోకింది? రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా కాలేజీల్లో హెల్త్ క్యాంపులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది?

ఇటీవల వెలువడిన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 'సంకలక్' నివేదిక మరియు కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ గణాంకాల ప్రకారం.. కర్ణాటకలో హెచ్ఐవీ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న కాలేజీ విద్యార్థులు, యువతలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. ఈ వయస్సు గల దాదాపు 7,000 మందికి పైగా యువతీ యువకులు హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలడం గమనార్హం. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతుంటే, అందులో దాదాపు 54,000 మందికి తమకు ఆ వైరస్ ఉందనే విషయమే తెలియదని అధికారులు చెబుతున్నారు.

అసలు నైన్టీస్ నాటి ఈ సమస్య.. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ అయిన జెన్ జీ ను ఎందుకు వేధిస్తోంది? 2023-24లో 18 నుంచి 35 ఏళ్ల వయసు వారిలో ఈ కేసుల సంఖ్య 44,500 ఉండగా.. కేవలం రెండేళ్లలో, అంటే 2025-26 నాటికి అది ఏకంగా 66,600 కు పైగా పెరిగిపోయింది. ఆరోగ్య నిపుణులు మరియు విశ్లేషకులు దీనికి కొన్ని ప్రధాన కారణాలను చెబుతున్నారు. మొదటిది.. అవగాహన లేకపోవడం మరియు సురక్షితం కాని శారీరక సంబంధాలు. రెండోది.. నేటి యువతలో పెరుగుతున్న డ్రగ్స్ అలవాటు. ఒకే సిరంజి లేదా నీడిల్‌ను ఒకరి కంటే ఎక్కువ మంది వాడటం వల్ల ఈ వైరస్ చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి పాకుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరిస్థితి తీవ్రతను గమనించిన కర్ణాటక ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ తక్షణమే అలర్ట్ అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, మరియు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలతో పాటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తక్షణమే 'ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపులు' నిర్వహించాలని విద్యాశాఖను ఆదేశించాయి. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులకు ఉచితంగా హెచ్ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు మరియు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఒక కీలకమైన రూల్ పెట్టింది. ఈ పరీక్షలు ఏ విద్యార్థిపైనా బలవంతంగా చేయరు.. కేవలం సదరు విద్యార్థి పూర్తి ఇష్టపూర్వక అంగీకారం ఉంటేనే ఈ స్క్రీనింగ్ నిర్వహిస్తారు.

సమాజంలో హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడానికి చాలా మంది భయపడతారు లేదా అవమానంగా భావిస్తారు. అందుకే కర్ణాటక ప్రభుత్వం ఒక అద్భుతమైన టెక్నాలజీని తీసుకువచ్చింది. కాలేజీలు, పబ్లిక్ ప్రదేశాలలో 'నో యువర్ హెచ్ఐవీ స్టేటస్' పేరిట ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులు తమ మొబైల్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఒక ప్రైవేట్ వెబ్‌పేజీలోకి వెళ్లి, తమ వివరాలు లేదా గుర్తింపు ఏమీ బయట పెట్టకుండానే తమకు ఉన్న హెచ్ఐవీ రిస్క్ ఏంటో సులభంగా తెలుసుకోవచ్చు.ఒకవేళ పరీక్షల్లో పాజిటివ్ అని తేలినా, సదరు విద్యార్థి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచి, వారికి కావాల్సిన యాంటీరెట్రోవైరల్ థెరపీ చికిత్సను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కర్ణాటక కాలేజీల్లో కలకలం రేపుతున్న ఈ షాకింగ్ రిపోర్ట్ వెనుక ఉన్న అసలు నిజాలు. ఈ భయంకర పరిస్థితుల నుంచి యువతను కాపాడుకోవాలంటే భయం కంటే.. సరైన అవగాహన, తగిన జాగ్రత్తలు చాలా అవసరం.

Published : 
  • 31 July 2026, 10:51 AM IST