మిల్కీ బ్యూటీ తమన్నా.. కర్ణాటక పాలిటిక్స్‌లో మరోసారి రచ్చ రాజేసింది. మైసూర్ శ్యాండలో సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం అమల్లోకి రావడంతో.. మళ్లీ వివాదం మొదలైంది. కన్నడ అందాలు పనికిరావా.. తమన్నా కోసం కోట్లు తగలేస్తారా అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ వివాదాల సంగతి మాకెందుకు బిజినెస్ మా లక్ష్యం అంటూ టర్నోవర్‌పై టార్గెట్ ఫిక్స్ చేసుకుంది కేఎస్‌డీఎల్.నడుమొంపుల వయ్యారి.. మిల్కీ బ్యూటీ.. తమన్నా భాటియా కన్నడనాట రచ్చ రాజేసింది. మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె నియామకం మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది. ఇప్పటికే ఆ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో.. వద్దని చెప్తున్నా తమన్నా బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు తీసుకోవడం వివాదాస్పదమైంది.
108 ఏళ్ల చరిత్ర ఉన్న కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ KSDL తన ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండల్ సోప్‌ను కొత్త హంగులతో రీలాంచ్ చేస్తోంది. మహారాజా నల్వడి కృష్ణరాజ వడియార్ ముందుచూపుతో ప్రారంభమైన ఈ కర్ణాటక వారసత్వాన్ని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికి కంపెనీ టర్నోవర్‌ను 5వేల కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నార్త్ ఇండియాలో మార్కెట్ పెంచుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పాన్-ఇండియా క్రేజ్ ఉన్న హీరోయిన్ తమన్నా భాటియాను ప్రచారకర్తగా ఎంచుకుంది.
గత ఏడాది మే నెలలో తమన్నాను 6.2 కోట్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీరుపై వివాదం చెలరేగింది. లోకల్ టాలెంట్ కాదని.. బయటివారిని ఎలా తెస్తారంటూ కన్నడ సంఘాలు, సోషల్ మీడియా యూజర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. కర్ణాటక ఆత్మగా భావించే మైసూర్ శాండల్ బ్రాండ్‌కు.. ముంబైకి చెందిన నటిని ఎలా తీసుకుంటారని మండిపడుతున్నారు. కన్నడ నటీమణులను కాదని, ఇతర భాషా నటీమణులకు కోట్ల రూపాయలు చెల్లించి ప్రోత్సహించడం ఏంటని వారు నిలదీస్తున్నారు. దీంతో.. ఈ ఇష్యూ మళ్లీ పొలిటికల్ టర్న్ తీసుకుంది.