నీకు స్టంపింగ్ రూల్స్ తెలీదు ధోనీనే దబాయించిన సాక్షి

వరల్డ్ క్రికెట్ లో కెప్టెన్ గానే కాదు బెస్ట్ వికెట్ కీపర్ గా మహేంద్రసింగ్ ధోనీ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వికెట్ల వెనుక ధోనీ ఉన్నాడంటే బ్యాటర్ ముందుకెళ్ళి ఆడేందుకు భయపడతారు.

Post Published By: Vencateshg
Updated : 29 October 2024, 7:29 PM IST

వరల్డ్ క్రికెట్ లో కెప్టెన్ గానే కాదు బెస్ట్ వికెట్ కీపర్ గా మహేంద్రసింగ్ ధోనీ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వికెట్ల వెనుక ధోనీ ఉన్నాడంటే బ్యాటర్ ముందుకెళ్ళి ఆడేందుకు భయపడతారు. అలాంటి ధోనీకి స్టంపింగ్ రూల్స్ తెలీవంటూ అతని భార్య సాక్షి దబాయించిన ఘటనను తనే స్వయంగా వెల్లడించాడు. ఒక రోజు మ్యాచ్ చూస్తున్నప్పుడు బ్యాటర్ స్టంపౌట్ అయ్యాడు. లెగ్ సైడ్ వైడ్ బాల్ గా వేసిన బంతికి ఔటయ్యాడు. అయితే సాక్షి మాత్రం అది స్టంపౌంట్ కాదని తనతో వాదించిందన్నాడు. వైడ్ బాల్ కు ఔట్ ఇవ్వడం తప్పంటూ , తనకు రూల్స్ తెలీదంటూ తేల్చేసిందని గుర్తు చేసుకున్నాడు. కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చిన తర్వాత కూడా ఆ స్టంపౌట్ విషయంలో ఏదో మిస్టేక్ అయ్యింది అంటూ తన వాదనని సమర్థించుకుందని ధోనీ చెప్పుకొచ్చాడు.

Published : 
  • 29 October 2024, 7:29 PM IST