చెన్నై ప్లేయర్స్‌తో ధోనీ చివరి ఫొటో… ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పినట్టేనా…?

మిస్టర్ మాస్టర్ మైండ్, సీఎస్కేను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన తలా ఎంఎస్ ధోనీ ఎట్టకేలకు చెపాక్ గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. ప్లేయింగ్ 11లో లేకపోయినప్పటికీ సీఎస్కే జెర్సీ వేసుకుని చెపాక్‌లో దర్శనమిచ్చాడు.

Post Published By: dialnews
Updated : 20 May 2026, 1:55 PM IST

మిస్టర్ మాస్టర్ మైండ్, సీఎస్కేను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన తలా ఎంఎస్ ధోనీ ఎట్టకేలకు చెపాక్ గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. ప్లేయింగ్ 11లో లేకపోయినప్పటికీ సీఎస్కే జెర్సీ వేసుకుని చెపాక్‌లో దర్శనమిచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ బ్రేక్ సమయంలో ఎంఎస్ ధోనీ గ్రౌండ్‌లోకి రావడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ విజిల్స్‌తో గోలగోల చేశారు.చెన్నై సూపర్ కింగ్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుందనగా.. అనూహ్యంగా ఎంఎస్ ధోనీ గ్రౌండ్‌లోకి వచ్చాడు. ధోనీ రావడంతో స్టేడియంలోని లైట్స్ అన్ని ఆగిపోయాయి. చీకట్లో ధోనీని చూసిన ఫ్యాన్స్ విజిల్స్ సౌండ్స్‌తో రీ సౌండ్ వచ్చేలా గోల చేశారు.

ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసే సమయానికి ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లందరితో కలిసి ఫొటో దిగాడు. ధోనీతో పాటు సంజూ శాంసన్, దూబే వంటి సీనియర్లు కుర్చీలలో కూర్చోగా.. మిగతా ఆటగాళ్లు వెనుక నించుకున్నారు. ఇదంతా చూసిన అభిమానులు ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో చివరి ఫొటో అంటూ ఊహాగానాలు చేశారు. ఫొటో దిగడం పూర్తయిన తర్వాత వెంటనే ధోనీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు.ఐపీఎల్ 2026లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న చివరి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో ధోనీ కచ్చితంగా ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నప్పటికీ జట్టు ప్రాధాన్యత మూలంగా ధోనీ ప్లేయింగ్ 11లోకి రాలేదు. ప్లే ఆఫ్స్‌కి ముందు సన్‌రైజర్స్‌తో ఈ మ్యాచ్ చాలా కీలకం కావడంతో ధోనీ తనకు తానే తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సీజన్ ఆరంభంలో తొడ గాయం కారణంగా జట్టుకు దూరమైన ధోనీ ఇప్పటి వరకు మళ్లీ ఎంట్రీ ఇవ్వలేదు. తొలుత రెండు వారాల పాటు రెస్ట్ అని చెప్పిన మేనేజ్‌మెంట్, ఆ తర్వాత ధోనీ నిర్ణయం అంటూ వదిలేశారు. పూర్తి స్తాయి ఫిట్‌నెస్ సాధించినప్పటికీ జట్టు ప్లే ఆఫ్స్‌కు దగ్గరవుతున్న వేళ ఎలాంటి ప్రయోగాలు చేయకూడదనే జట్టులోకి ధోనీ రాలేదు. ఇక ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ, ఐపీఎల్‌కు గుడ్ బై చెప్తాడా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.

Published : 
  • 20 May 2026, 1:55 PM IST