అనంతపురం నగరం సవాళ్లు ప్రతి సవాళ్లతో అట్టుడుకుతోంది. మడకశిర టిడిపి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిగా మారింది. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సవాల్ విసిరారు. లేదంటే గురువారం సాయంత్రం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తానని హెచ్చరించారు. ఉదయం నుంచి ఎమ్మెస్ రాజు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఉంటున్న...తాను కొనుగోలు చేసిన ఇంటికి వెళ్లీ తీరుతానని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అంటున్నారు. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నారు. పోలీసులు తోపుదుర్తి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. రాళ్లు, ఖాళీ బీరు సీసాలను అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో ప్రకాష్‌రెడ్డి తండ్రి ఆత్మారామిరెడ్డి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
ఉద్రిక్తత నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల శ్రీరామ్ తదితరులు ఎమ్మెల్యే రాజు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలకు రెడీ కావడంతో...ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరు ఇళ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలలకే ఎంఎస్ రాజు...7 కోట్ల రూపాయల విల్లా కొనుగోలు చేశారని తోపుదుర్తి ఆరోపించారు. అంతేకాకుండా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని అన్నారు. దీంతో ఎంఎస్ రాజుకు కోపం నషాళానికి అంటింది.
తోపుదుర్తి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని...సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు ఎమ్మెస్ రాజు. తనపై చేసిన ఆరోపణ నిరూపించకపోతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి చెప్పుతో కొడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంఎస్ రాజు కొనుగోలు చేసిన ఇంట్లోనే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అద్దెకు ఉంటున్నారు. ఆ ఇంటిని వైసీపీకి చెందిన కలమాడి రుక్మిణి, శ్రీనివాసులు నిర్మించుకున్నారు. ఐదు సంవత్సరాలుగా అద్దె కట్టకుండా వైశ్రీనివాస్ ఇంట్లో ఉంటున్నాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రెండు కోట్ల 85 లక్షల రూపాయలకు ఇల్లు కొనుగోలు చేస్తున్ట్లు అగ్రిమెంట్ చేసుకున్నారు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడో.. నాయకులకు కూడా అలాగే ప్రవర్తిస్తారని టీడీపీ నేతలు మండిపడ్డారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కారుకు టిప్పర్ తగిలిందని.. హత్యకు కుట్ర చేశారని ఆరోపించడం తగదన్నారు.. మంత్రి నారా లోకేష్ జాతీయంగా అంతర్జాతీయంగా ఎదుగుతుండడం చూసి ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ పై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శిస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ను రాజకీయంగా ఎమ్మెస్ రాజు ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడారన్నారు.