అనుకున్నది సాధించిన బండ్ల గణేష్.. 22 రోజుల పాదయాత్రతో శ్రీవారి సన్నిధికి అభిమాని..!
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తన దృఢ సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన కూటమి విజయం తర్వాత.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం ఆయన చేపట్టిన సంకల్ప పాదయాత్ర నేటితో విజయవంతంగా అలిపిరి చేరుకుంది.