మెడికల్ అండ్ హెల్త్ లో పనిచేసి రిటైర్ అయ్యాను.2020లో రిటైర్ అయ్యాను. నాది ఒక 40 లక్షల రూపాయల బిల్లు ఉంది. అది సూయి లేదు. సయి లేదు.10 పర్సెంట్ అడిగింది బట్టి విక్రమార్క పెళ్ళాం,నేను పోతే డైరెక్ట్ గా.టెన్ పర్సెంట్.... టెన్ పర్సెంట్.... ఎయిట్ పర్సెంట్.... ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళ బిల్లులే పాస్ అవుతున్నాయి.160....170 కోట్లు రిలీజ్ అయినయి అంటున్నారు.200....700 కోట్లు రిలీజ్ అవుతున్నాయి అంటున్నారు. ఏం లేదు అక్కడ.ఒక యూట్యూబ్ ఛానల్ తో డైరెక్ట్ గా మాట్లాడిన రిటైర్డ్ మహిళా ఉద్యోగి ఆవేదన ఇది. తెలంగాణ హిస్టరీలో ఒక మంత్రి భార్య ఎప్పుడు.... ఎక్కడ ఇలా ఓపెన్ గా ఆరోపణలు రాలేదు.
బిల్లుల చెల్లింపుకు పర్సంటేజ్ తీసుకుంటారన్నది ఓపెన్ సీక్రెట్. కెసిఆర్ పదేళ్ల పాలనలో... ఆ తర్వాత కాంగ్రెస్ పాలనలో నిత్యం జరిగేది అదే. ఇక ఇరిగేషన్ కాంట్రాక్ట్ లోను.... ఇతర వర్క్స్ లోను 6 నుంచి 8 పర్సెంట్ కమిషన్ తీసుకుంటారన్నది కూడా ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి పాలన దగ్గర నుంచి వింటూనే ఉన్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను ఇరిగేషన్ కాంట్రాక్టర్ గా ఆరు శాతం కమిషన్ ఇచ్చానని బహిరంగంగానే చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సంచలన స్టేట్మెంట్ వేరు. తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రిగారి భార్య బిల్లులు చెల్లించడానికి స్వయంగా తనకి 10 పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినట్లు ఒక రిటైర్డ్ మహిళా ఉద్యోగి బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
ఆర్థిక మంత్రి బిల్లుల చెల్లింపులకు కమిషన్లు తీసుకుంటారు అనే రాజకీయ ఆరోపణలు తరచూ వింటూనే ఉంటాం. కానీ ఆర్థిక మంత్రి భార్య పై ఒక సామాన్య రిటైర్డ్ ఉద్యోగిని అంత సంచలన ఆరోపణ చేసింది అంటే, అది అబద్ధం అని ఎలా అనుకుంటాం? ఆర్థిక మంత్రి గారి భార్యపై ఆరోపణ చేయడం అంటే ఎంత ధైర్యం ఉండాలి? భవిష్యత్తులో ఎదుర్కోబోయే లీగల్, క్రిమినల్ కేసులకు ఆ సామాన్య మహిళ ఎదురు నిలబడగలరా? అయినా సరే జరిగిన విషయాన్ని బయట పెట్టింది అంటే... ఆ మహిళ ఎంత ఆవేదన చెందిందో, ఆర్థికంగా ఎంత నలిగిపోయి ఉందో అర్థమవుతుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని పై ఇలా కొత్త ఏమి కాదు. బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వం లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి సంపాదించి, ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా పేరు మార్చి అక్కడ కాలు పెట్టిన దగ్గర నుంచి వారి కుటుంబం వ్యవహార శైలి, రాజసం, అంగు ఆర్భాటాలు అన్ని మారిపోయాయని అప్పట్లోనే బాగా టాక్ నడిచింది.
బట్టి ,నందిని పెద్ద కుమారుడి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కు అంత భారీగా ప్రజా భవన్ లోనే నిర్వహించడం పై కూడా విమర్శలు వచ్చినాయి. అయినా తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్కడ తగ్గలేదు. అన్నిటికీ మించి ఖమ్మం ఎంపీ సీటు కోసం నందిని స్వయంగా వందల కార్లలో వెళ్లి ముందుగానే నామినేషన్ వేయడం పై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. హై కమాండ్ నిర్ణయాన్ని కూడా కాదని, అసలు ఎంపీ అభ్యర్థి ఎవరో నిర్ణయించకుండానే డిప్యూటీ సీఎం భార్య అంత హంగు ఆర్భాటాలతో వెళ్లి నామినేషన్ ఎలా వేస్తారు అని పార్టీలోనే ఒక రేంజ్ లో అందరూ మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత నందిని తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు అది వేరే విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంపదలు సృష్టిస్తాను... ఆ సంపదలు అందరికీ పంచి పెడతాను అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క తరచూ చెప్పే డైలాగు ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నారు. ఓహో సంపదలు సృష్టించడం అంటే ఇదా అని అనుకుంటున్నారు. బిల్లులకు కమిషన్లు తీసుకుని రిలీజ్ చేస్తున్నారు అనేది బహిరంగ రహస్యం. తద్వారా వచ్చే కోట్ల రూపాయలను తిన్నంత తిని కాంగ్రెస్ హై కమాండ్ కు పంపుతున్నారని, రాష్ట్రాల్లో ఎన్నికల కోసం కాంగ్రెస్ కి తెలంగాణ నుంచి కోట్ల రూపాయలు వెళుతున్నాయని తరచూ బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు రిటైర్డ్ మహిళా ఉద్యోగి మాట్లాడింది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. ఆమె కన్నీళ్ళ నుంచి వచ్చిన ఆవేదన. అందుకే ఆ రిటైర్డ్ ఉద్యోగిని ఆవేదన పై ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చ జరుగుతుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆర్థిక మంత్రి బట్టి సహకారం లేకుండానే ఆయన భార్య నందిని కమిషన్లు డిమాండ్ చేస్తారా? అని పొలిటికల్ సర్కిల్స్లో మాట్లాడుకుంటున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నిర్వహిస్తున్న కేవలం ఆర్థిక శాఖలో మాత్రమే కాదు, విద్యుత్ శాఖలోనూ వసూళ్లు బాగానే జరిగాయని... ఇప్పటికీ జరుగుతున్నాయని చాలామంది బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. పార్టీలో మరికొందరు ఈ వ్యవహారాలన్నిటిపై హై కమాండ్ కు లేఖలు కూడా రాశారు. ఇవన్నీ గ్రహించి బట్టి విక్రమార్క తనకు ఆర్థిక శాఖ నుంచి విముక్తి కలిగించాలని హై కమాండ్ ను కోరినట్లు సమాచారం.