బీఎస్పీ పొత్తు ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద భారీగా పడేలా కనిపిస్తోంది. పొత్తు ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. ఆదిలాబాద్‌లో కీలక నేతలంతా.. కారుకు, సారుకు బైబై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. కీలక నేతలు, మాజీ మంత్రులు కూడా ఈ లిస్ట్‌లో ఉండడం.. గులాబీ శ్రేణులను మరింత టెన్షన్ పెడుతోంది.
