2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. కొందరు ఇతర పార్టీల్లో గెలిచినప్పటికీ, బీఆర్ఎస్‌లో చేరిపోయారు. వీరిలో 28 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ అప్పట్లోనే కేసులు నమోదయ్యాయి. వీరిపై పోటీ చేసి ఓడిపోయిన సమీప అభ్యర్థులు వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు.
