బ్రేకింగ్: పోసాని అరెస్ట్…?

గత అయిదేళ్లుగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పలువురిపై కూటమి సర్కార్ తీవ్ర చర్యలకు దిగుతోంది. తాజాగా సినీ నటులు, దర్శకులపై కూడా కేసులు నమోదు అయ్యాయి.

Post Published By: Vencateshg
Updated : 11 November 2024, 4:25 PM IST

గత అయిదేళ్లుగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పలువురిపై కూటమి సర్కార్ తీవ్ర చర్యలకు దిగుతోంది. తాజాగా సినీ నటులు, దర్శకులపై కూడా కేసులు నమోదు అయ్యాయి. హాస్యనటుడు పోసాని మురళీకృష్ణ ను వెంటనే అరెస్ట్ చేయాలి.. రాజమండ్రిలో ఎస్పీకి ఫిర్యాదు చేసారు జనసేన నాయకులు. పోసాని అరెస్టుపై కంప్లైంట్ పెట్టిన కనీసం గతంలో పోలీసులు పట్టించుకోలేదు.

కోర్టు ఆదేశాలు ప్రకారం పోసానిపై చర్యలు తీసుకోవాలని... రాజమహేంద్రవరం జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ డిమాండ్ చేసారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన గత ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఈ రోజు జనసేన నాయకులతో కలిసి ఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చారు జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్, లీగల్ సెల్ వైస్ చైర్మన్ AVNS రామచంద్ర. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని, పోసాని అరెస్టుకు రంగం సిద్ధం చేయాలని జనసేన నేతలు కోరారు.

Published : 
  • 11 November 2024, 4:25 PM IST