మీ అంతు చూస్తారారేయ్: చంద్రబాబు వార్నింగ్

ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్.. వదిలే ప్రసక్తేలేదు అంటూ హెచ్చరించారు.

Post Published By: Vencateshg
Updated : 20 November 2024, 1:51 PM IST

ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్.. వదిలే ప్రసక్తేలేదు అంటూ హెచ్చరించారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అది చేస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. గంజాయి, డ్రగ్స్ కారణంగానే అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.

కరడుగట్టిన నేరస్తులకు ఏపీలో స్థానం లేదని హెచ్చరించారు. నేరాలు చేస్తే తాట తీస్తామన్నారు. ఎవరైనా బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. బెల్ట్ షాపులు లేకుండా ఎమ్మెల్యేలే చూడాలి అని స్పష్టం చేసారు. తన పాలనపై సందేహాలు అవసరం లేదని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను అన్నారు.

Published : 
  • 20 November 2024, 1:51 PM IST