రేవంత్ సెన్సేషనల్, టార్గెట్ మూసీ…!

మూసి నది ప్రక్షాళన విషయంలో రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేయనుంది. మూసి ఒడ్డున కూల్చి వేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది.

Post Published By: Vencateshg
Updated : 24 September 2024, 6:19 PM IST

మూసి నది ప్రక్షాళన విషయంలో రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేయనుంది. మూసి ఒడ్డున కూల్చి వేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది. యాక్షన్ ప్లాన్ పై సెక్రటేరియట్ లో ఎంఏ, యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి పలువురు అధికారులు భేటీ అయ్యారు. మూసిపై 13వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఇప్పటికే మూసి నివాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కూల్చివేతల సందర్బంగా నివాసితులు నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టారు. ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా కల్పించిన తర్వాత... హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగనున్నాయి.

Published : 
  • 24 September 2024, 6:19 PM IST