Top story: చెల్లెలకు జగన్ బంపర్ ఆఫర్..? షర్మిలతో జగన్ రాజీ ప్రయత్నాలు..? చెల్లెలి కోసం జగన్ తగ్గాడా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఒక సంచలన వార్త ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గత కొంతకాలంగా ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఆస్తుల గొడవలతో వీధిన పడిన వైఎస్ కుటుంబ వ్యవహారం

Post Published By: dialnews
Updated : 22 July 2026, 12:10 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఒక సంచలన వార్త ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గత కొంతకాలంగా ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఆస్తుల గొడవలతో వీధిన పడిన వైఎస్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరగబోతోందా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు! వైఎస్ షర్మిలతో రాజీ పడటానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా అడుగులు వేస్తున్నట్లు అత్యంత నమ్మదగిన సమాచారం బయటకు వచ్చింది. మళ్లీ పార్టీలోకి వస్తే సముచిత స్థానంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏకంగా హోం మంత్రి లేదా కీలకమైన మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అసలు జగన్ హఠాత్తుగా ఎందుకు తగ్గుతున్నారు? జనవరి లోపు ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలని జగన్ ఎందుకు భావిస్తున్నారు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ కుటుంబానికి గత రెండు మూడేళ్లుగా పట్టిన గ్రహణం అంతా ఇంతా కాదు. అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి జగన్‌ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను నిజం చేస్తూ జగన్ మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. సమాచారం ప్రకారం... జగన్ క్యాంప్ నుండి షర్మిలకు రాయబారాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

కేవలం కుటుంబ పరంగానే కాకుండా, రాజకీయంగా కూడా ఇద్దరం కలిసి పనిచేద్దామనే ప్రతిపాదనను జగన్ ముందుంచినట్లు సమాచారం. ఒకవేళ షర్మిల మళ్లీ వైసీపీ గూటికి చేరితే... ఆమెకు పార్టీలో నంబర్ 2 స్థానాన్ని కట్టబెట్టడమే కాకుండా, భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే అత్యంత కీలకమైన మంత్రి పదవిని కూడా ఇస్తానని జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు పొలిటికల్ టాక్. ఇక్కడ అందరికీ వచ్చే అనుమానం ఒక్కటే... నిన్నటి వరకు అంతలా విమర్శించుకున్న జగన్, ఇప్పుడే ఎందుకు షర్మిలతో రాజీకి ప్రయత్నిస్తున్నారు? దీని వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. వచ్చే జనవరి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సరికొత్త పంథాలో జనంలోకి వెళ్లబోతున్నారు.

జిల్లా స్థాయి పర్యటనలు, భారీ బహిరంగ సభలతో ఏపీ రాజకీయాలను హీటెక్కించడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. అయితే జగన్ జనంలోకి వెళ్లేలోపు, కూటమి ప్రభుత్వం జగన్‌ను టార్గెట్ చేయడానికి వాడుకుంటున్న అతిపెద్ద అస్త్రాన్ని నిర్వీర్యం చేయాలని భావిస్తున్నారు. ఆ అస్త్రమే వైఎస్ షర్మిల మరియు కుటుంబ ఆస్తుల గొడవ. జగన్ పర్యటనలు మొదలుపెడితే... కూటమి నాయకులు ఖచ్చితంగా "సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వాడు, ప్రజలకేం న్యాయం చేస్తాడు?" అంటూ విమర్శలు గుప్పిస్తారు.

ఆ విమర్శలకు తావు లేకుండా చేయాలంటే... జనవరి లోపే షర్మిలతో ఉన్న అన్ని రకాల కోర్టు వివాదాలను, కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. మరి జగన్ పంపిన ఈ రాయబారానికి, ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్‌కు వైఎస్ షర్మిల స్పందన ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల, ఏపీలో కాంగ్రెస్‌ను బతికించడానికి ఎంత ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. పైగా ఓట్ల చీలిక వల్ల అంతిమంగా అది వైసీపీకే నష్టం చేకూరుస్తోంది తప్ప కాంగ్రెస్‌కు వచ్చే మైలేజ్ ఏమీ లేదు.

ఈ క్రమంలో వైఎస్సార్ ఆశయాల కోసం, రాజన్న రాజ్యాన్ని మళ్లీ తేవడం కోసం అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే తాటిపైకి వస్తే క్యాడర్‌లో కొత్త ఉత్సాహం వస్తుందని వైఎస్సార్ అభిమానులు భావిస్తున్నారు. కానీ, గతంలో జగన్ తనను, తన తల్లి విజయమ్మను పట్టించుకోలేదనే అసంతృప్తి షర్మిలలో బలంగా ఉంది. మరి జగన్ ఇచ్చిన ఆఫర్‌ను నమ్మి షర్మిల మళ్లీ వైసీపీలోకి వస్తారా? లేదా కాంగ్రెస్ లోనే కొనసాగుతూ అన్నపై పోరాటం చేస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ షర్మిల కనుక జగన్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఇదొక పెను సంచలనమే అవుతుంది.ఏది ఏమైనా... జనవరి నుంచి ప్రారంభం కాబోయే జిల్లా పర్యటనల కంటే ముందే ఇటు కుటుంబంలోనూ, అటు పార్టీలోనూ ఉన్న లూప్ హోల్స్ అన్నింటినీ క్లోజ్ చేసి, ఒక పక్కా వ్యూహంతో క్లీన్ ఇమేజ్‌తో ప్రజల్లోకి వెళ్లాలని జగన్ వేస్తున్న అడుగులు నిజంగానే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఒకవేళ వైఎస్ షర్మిల మళ్లీ వైసీపీలోకి వస్తే కూటమి ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చినట్లవుతుంది.

Published : 
  • 22 July 2026, 12:10 PM IST