ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గం లో లిక్కర్ వ్యాపారులు బరితెగిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా మందు బాబుల కోసం టెంట్లను ఏర్పాటు చేసి మరి దగ్గరుండి మందు తాగిస్తున్నారు.నియోజకవర్గంలో ఉన్నటువంటి మంగిన పూడి బీచ్ సమీపంలో వైన్ షాప్ నిర్వాహకులు టెంట్లు వేసి మందు తాగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కనీసం ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడక పోవడంపై విమర్శలు వస్తున్నాయి.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారు.
నిబంధనలను ఎక్కడ పాటించకుండా ఇస్టారీతిని మద్యం అమ్మకాలు జరుపుతున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గం లో జరుగుతున్న ఈ మద్యం వ్యాపారుల బరితెగింపు కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత ఇలాఖా కావడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కనీసం ఎటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు అనే విమర్శలు వస్తున్నాయి అసలు టెంట్లు వేసి మందుబాబులను కూర్చోబెట్టి మద్యం తాగించడం ఏంటని సోషల్ మీడియాకి సంబంధించిన వైరలు అవుతున్న వీడియోలు పై నిర్జనలు కామెంట్లు చేస్తున్నారు.
మచిలీపట్నం మంగినపూడ బీచ్ సమీపంలో వైన్ నిర్వహకులు ఖాళీ స్థలంలో టెంట్లు పందిర్లు ఏర్పాటు చేసి మందుబాబులు తాగేందుకు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది అసలు ఈ విధంగా టెంట్లు పందిర్లు వేసి మద్యం తాగినందుకు అనుమతులు ఇచ్చారా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.టెంట్లు,పందిళ్ళ కింద మద్యం తాగేందుకు అనుమతి ఇచ్చిన బార్ లైసెన్సులలో నిబంధనలో ఉన్నాయా అని చర్చ జరుగుతోంది. మచిలీపట్నం మంగిన పూడి బీచ్ కు వెళ్లే దారిలో యదేచ్ఛగా నిబంధనలు పాటించకుండా బార్ అండ్ రెస్టారెంట్ పందిర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులుచోద్యం చూస్తూన్నరు. అధికార పార్టీ నేతల,సిండికేట్ ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.