దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను భూకంపం స్టార్ట్ అయింది. కేంద్ర మంత్రివర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ మార్పులు, చేర్పులు జరగబోతున్నాయంటూ కొన్ని లీక్స్ బయటపడ్డాయి. బిజెపి జాతీయ నేత నితిన్ నబీన్ తన కొత్త టీమ్‌ను రెడీ చేయడంతో.. అటు కేబినెట్ ప్రక్షాళనకు కూడా ముహూర్తం ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఆదివారం లేదా సోమవారం రోజే ఈ సంచలన మార్పులు ఉండబోతున్నాయట. అసలు ఎవరూ ఊహించని విధంగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ గారికి మంత్రి పదవి ఇవ్వడం దగ్గర నుండి.. నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి టాప్ లీడర్ల శాఖలు మార్చడం, తొలగించడం వరకు లిస్ట్ చాలా షాకింగ్‌గా ఉంది. అసలు ఎవరి పదవి ఊడుతోంది? ఎవరికి కొత్త బెర్త్ దక్కుతోంది?
ఈ లీక్స్ లో అన్నింటికంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్.. శక్తికాంత దాస్ గారి ఎంట్రీ. ఆర్బీఐ మాజీ గవర్నర్ మరియు ప్రస్తుతం ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయనకు.. ఈసారి పూర్తి స్థాయి కేబినెట్ బెర్త్ దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఆర్థిక శాఖ అప్పగిస్తారా అనే చర్చ నడుస్తోంది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను హెచ్ఆర్డి విభాగానికి బదిలీ చేసే అవకాశం ఉందట. ఇక ఇటీవల నీట్, సీబీఎస్ఈ వివాదాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు హర్దీప్ పూరిలను కేబినెట్ నుండి పూర్తిగా తొలగించే ఛాన్స్ ఉందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
ఇక కూటమి రాజకీయాల విషయానికి వస్తే.. ఉద్ధవ్ థాకరే వర్గం నుండి ఆరుగురు ఎంపీలను ఎన్డీఏ కూటమిలోకి తీసుకువచ్చినందుకు గానూ శివసేన (షిండే వర్గం) కు పెద్ద ప్రతిఫలమే దక్కబోతోంది. సీఎం ఏకనాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండేకు ఈసారి కేబినెట్ బెర్త్ దక్కడం దాదాపు ఖాయం అంటున్నారు. అలాగే పంజాబ్ రాజకీయాల్లో ఆప్ నుండి ఫిరాయించిన వారికి కూడా బహుమతి అందనుంది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అధినేత అశోక్ మిట్టల్, అలాగే రాఘవ్ చద్దా మధ్య ఒక బెర్త్ కోసం తీవ్ర పోటీ నడుస్తోంది. వీరిద్దరిలో ఎవరికి లక్ చిక్కుతుందో చూడాలి. అయితే గతంలో పార్టీ ఫిరాయించిన వారు ఇప్పుడు తమ గడువు ముగిసిందని తెలుసుకుంటున్నారు.
రవ్నీత్ బిట్టు స్థానంలో ఆర్ఎస్ఎస్ బలమైన నాయకుడు తరుణ్ చుగ్ ను నియమించి, పంజాబ్ ఎన్నికలకు బలాన్ని చేకూర్చాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ మార్పులు ఇక్కడితో ఆగడం లేదు బాసు. అనురాగ్ ఠాకూర్ ఈసారి పూర్తి స్థాయి కేబినెట్ బెర్త్‌తో తిరిగి వచ్చే అవకాశం ఉంటే.. మీరట్ ఎంపీ, రామాయణం సీరియల్ ఫేమ్ అరుణ్ గోవిల్ కు కూడా ఈసారి మంత్రి పదవి దక్కవచ్చట. బిహార్ నుండి సీఎం నితీష్ కుమార్ ను కూడా కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఖజురహో ఎంపీ విష్ణు దత్ శర్మ, బీహార్‌కు చెందిన జనార్దన్ సింగ్ సిగ్రివాల్ ల పేర్లు కూడా లిస్ట్‌లో బలంగా వినిపిస్తున్నాయి.
ఇక అవుట్ అవుతున్న వారి లిస్ట్ చూస్తే.. వచ్చే ఏడాది యూపీ ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని తప్పించవచ్చని సమాచారం. మనోహర్ లాల్ ఖట్టర్ తన విద్యుత్ శాఖను కోల్పోయే అవకాశం ఉంది. అలాగే శివసేన ఎంపీ ప్రతాప్రావు జాదవ్‌ను ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పదవి నుండి తొలగించి, ఉద్ధవ్ శివసేన నుండి లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ పెట్టి ఫిరాయించిన సంజయ్ దీనా పాటిల్ కు ఆ పదవి అప్పగించవచ్చని, జాదవ్‌కు ఆయుష్ శాఖ ఇవ్వవచ్చని టాక్. వీరందరితో పాటు మరో అరడజను మంది సహాయ మంత్రులకు ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది.నితిన్ నబీన్ కొత్త టీమ్ వేస్తున్న స్కెచ్, రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ చేస్తున్న ఈ భారీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లీక్స్ నిజంగానే మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. మరి ఆది, సోమవారాల్లో జరగబోయే ఈ మార్పుల్లో ఏ లీక్ నిజమవుతుంది అనేది చూడాలి.