YSRCP Vs TDP: దీపావళి వేళ టీడీపీ, వైసీపీ పోస్టర్‌ వార్‌..

పండగలకు చెప్పే శుభాకాంక్షల్లో కూడా ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు వైసీపీ టీడీపీ నేతలు. దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ వైసీపీ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఆ పోస్టర్‌లో చంద్రబాబు రావణుడి గెటప్‌లో ఉన్నారు.

Post Published By: narender Thiru
Updated : 12 November 2023, 7:16 PM IST

YSRCP Vs TDP: ఏపీలో పొలికల్‌ వార్‌ రోజు రోజుకూ పీక్స్‌కు చేరిపోతోంది. విమర్శకు కాదేదీ అనర్హం అన్నట్టు పోటాపోటీ విమర్శలు చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఆఖరికి పండగలకు చెప్పే శుభాకాంక్షల్లో కూడా ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు వైసీపీ టీడీపీ నేతలు. దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ వైసీపీ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

REVANTH REDDY: దాడుల పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు.. హరీష్ రావుది సురభి నాటకం: రేవంత్ రెడ్డి

ఆ పోస్టర్‌లో చంద్రబాబు రావణుడి గెటప్‌లో ఉన్నారు. రావణుడి పది తల స్థానంలో పవన్‌ కళ్యాణ్‌, అచ్చంనాయుడు, రామోజీరావు లాంటి చంద్రబాబు మద్దతుదారులను పెట్టి పోస్టర్‌ తయారు చేశారు వైసీపీ నేతలు. ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఆ పోస్టర్‌కు టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఇస్తూ మరో పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. సీఎం జగన్‌ను నరకాసురుడిగా చూపిస్తూ.. చంద్రబాబు ఆయనకు బాణం వేస్తున్నట్టుగా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. త్వరలోనే ఈ అసురుడి నుంచి ఏపీకి విముక్తి కలగబోతోదంటూ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఈ రెండు ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. మీరు ప్రజలకు విషెస్‌ చెప్తున్నారా.. లేక మీకుమీరు విమర్శలు చేసుకోవడానికి దీపావళిని వాడుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు కామన్‌ పీపుల్‌. పొలిటీషియన్స్‌ అంతా రోజూ ఎలాగూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూనే ఉంటారు. కనీసం పండగరోజైనా ఇలాంటివి పక్కన పెట్టొచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు.

Published : 
  • 12 November 2023, 7:16 PM IST