శ్రీతేజ్ హెల్త్ అప్డేట్, డాక్టర్స్ సెన్సేషనల్ కామెంట్స్, గతం మర్చిపోయిన చిన్నారి…?

టాలీవుడ్ చరిత్రలోనే సంధ్య థియేటర్ ఘటన అనేది అత్యంత విషాదంతా... చెప్పుకోవాలి. ప్రాణాలు కోల్పోయింది ఒక్కరే అయినా సినిమా పరిశ్రమ మొత్తం బాగా ఇబ్బంది పడింది.

Post Published By: Vencateshg
Updated : 31 January 2025, 1:20 PM IST

టాలీవుడ్ చరిత్రలోనే సంధ్య థియేటర్ ఘటన అనేది అత్యంత విషాదంతా... చెప్పుకోవాలి. ప్రాణాలు కోల్పోయింది ఒక్కరే అయినా సినిమా పరిశ్రమ మొత్తం బాగా ఇబ్బంది పడింది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కూడా చాలా ఆందోళన వ్యక్తం అయింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉండటంతో సమస్య మరింత తీవ్రమైంది. ఇక అల్లు అర్జున్ ప్రవర్తన కూడా విమర్శలకు దారితీసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుని అల్లు అర్జున్ పరామర్శించకపోవడం విమర్శలకు దారితీసింది.

ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అవడం ఆయన బెయిల్ బయటకు రావడం అన్ని సంచలనయ్యాయి. ఈ ఘటన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సినిమా పరిశ్రమకు సహకారం అందించే విషయంలో వెనకడుగు వేశాయి. ముఖ్యంగా బెనిఫిట్ షోలు అలాగే టికెట్ ధరల పెంపు విషయంలో న్యాయస్థానాలు కూడా సీరియస్ గా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా పరిశ్రమకు సహాయం చేయలేక చేతులెత్తేశాయి. ఈ ఘటన తర్వాత సినిమా పరిశ్రమపై న్యాయస్థానాలు సీరియస్ అవుతూ ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసాయి.

దీనితో సినిమా పరిశ్రమకు కాస్త గడ్డుకాలం నడుస్తుందనే క్లారిటీ జనాలకు వస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో హడావుడి చేసే హీరోలకు నిర్మాతలకు ప్రభుత్వాలు ఇప్పటివరకు అండగా నిలబడుతూ వచ్చాయి. కానీ ఒక్క ప్రాణం పోవడంతో సినిమా మొత్తం తిరగబడింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని కానీ అతనికి ఏమి గుర్తు లేవని కుటుంబ సభ్యులను కూడా అతని గుర్తుపట్టలేకపోతున్నాడని వెల్లడించారు.

అలాగే ఎవరైనా పలకరించినా సరే అతని నుంచి రెస్పాన్స్ ఉండట్లేదని పేర్కొన్నారు. కనీసం స్నేహితులు, కుటుంబ సభ్యులు పలకరించిన సరే అతని నుంచి రెస్పాన్స్ లేదని తెలిపారు. ప్రస్తుతం అతనికి వైద్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక అతనికి అతని కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే అండగా ఉంటామని అల్లు కుటుంబ సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రెండు కోట్ల రూపాయలను చిన్నారి కుటుంబానికి అందించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహాయం చేసింది. అయితే ఇప్పుడు చిన్నారి ఆరోగ్య పరిస్థితి పైనే క్లారిటీ రావడం లేదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని కామెంట్స్ ప్రకారం.. ఆ చిన్నారి గతం మర్చిపోయాడని భవిష్యత్తు అతనికి కష్టం కానుంది అని కొంతమంది వైద్యులు కామెంట్ చేస్తున్నారు.

Published : 
  • 31 January 2025, 1:20 PM IST