Sunny Leone Vs Roja: మంత్రి రోజాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సన్నీలియోన్

పవన్‌ కళ్యాణ్‌ నీతులు మాట్లాడుతుంటే సన్నీ లియోన్‌ వేదాలు వల్లించినట్టు ఉంటుందన్నారు రోజా. సన్నీలియోన్‌ పేరు వాడి సామెతను కొత్తగా ట్రై చేశాను అనుకున్నారు మంత్రి రోజా.. కానీ రోజా చేసిన కామెంట్స్‌కు సన్నీ లియోన్‌ అదే స్థాయిలో బ్లాస్టింగ్‌ కౌంటర్‌ ఇస్తూ ట్వీట్‌ చేసింది.

Post Published By: Raju Cln
Updated : 15 July 2023, 11:52 AM IST

మాట తప్పుగా మాట్లాడితే ప్రాణం పోయినా తిరిగి తీసుకోలేం. తూటా కంటే మాట పవర్‌ఫుల్‌. అందుకే ప్రతీ మాటా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే, ఎవరిని పడితే వాళ్లను మధ్యలో లాగితే తిరిగి మనకే తగులుతుంది. ఇప్పుడు ఏపీ మంత్రి రోజా సరిస్థితి కూడా ఇదే. నిన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా టార్గెట్‌ చేశారు. అక్కడితో ఆగకుండా మాజీ పోర్న్‌ స్టార్‌ సన్నీ లియోన్‌ను మధ్యలోకి లాగారు. పవన్‌ కళ్యాణ్‌ నీతులు మాట్లాడుతుంటే సన్నీ లియోన్‌ వేదాలు వల్లించినట్టు ఉంటుందన్నారు. పెళ్లాలలను వదిలేసే పవన్‌ నీతులు మాట్లాడుతున్నారంటూ కౌంటర్‌ ఇచ్చారు. సన్నీలియోన్‌ పేరు వాడి సామెతను కొత్తగా ట్రై చేశాను అనుకున్నారు మంత్రి రోజా.. కానీ రోజా చేసిన కామెంట్స్‌కు సన్నీ లియోన్‌ అదే స్థాయిలో బ్లాస్టింగ్‌ కౌంటర్‌ ఇస్తూ ట్వీట్‌ చేసింది.

తాను గతంలో చేసిన పని గురించి తనకు ఎమాత్రం బాధ లేదని చెప్పింది సన్నీ. తాను ఏది చేయాలనుకుందో అదే పని ధైర్యంగా పబ్లిక్‌గా చేశానని.. కొందరిలా చాటుగా చేయలేదని చెప్పింది. ఇక రోజాను టార్గెట్‌ చేస్తూ "నీకు నాకు చాలా తేడా ఉంది.. నేను ఆ ఇండస్ట్రీని వదిలేశాను కానీ నువ్‌ ఇంకా వదలలేదు" అంటూ చెంపచెల్లుమనిపించినట్టు కౌంటర్‌ ఇచ్చింది. సన్నీ చేసిన ట్వీట్‌ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోపక్క జనసేన కార్యకర్తలు ఈ ట్వీట్‌ను విపరీతంగా షేర్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు బాగా అయ్యిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి. సంబంధం లేని వ్యక్తిని మధ్యలో లాగి. ఇంటర్నెట్‌లో తన పరువు తానే తీసుకున్నారు మంత్రి రోజా.

http://

Published : 
  • 15 July 2023, 11:52 AM IST