Top story:దీనెమ్మ.. ఇరాన్ దమ్ము, ధైర్యం ఏంట్రా..? అమెరికా కి అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఎలా..? అమెరికన్ ఆర్మీని సొర చేపలకే…!

సూపర్ పవర్ అని గర్వపడే అగ్రరాజ్యానికి ఇరాన్ మునుపెన్నడూ లేని రీతిలో మరణ శాసనం రాసింది. 'మా గడ్డపై అడుగు పెడితే.. మీరు తిరిగి వెళ్లరు.. పర్షియన్ గల్ఫ్ సముద్రంలోని సొరచేపలకు మీరు రుచికరమైన

Post Published By: dialnews
Updated : 31 March 2026, 12:32 PM IST

సూపర్ పవర్ అని గర్వపడే అగ్రరాజ్యానికి ఇరాన్ మునుపెన్నడూ లేని రీతిలో మరణ శాసనం రాసింది. 'మా గడ్డపై అడుగు పెడితే.. మీరు తిరిగి వెళ్లరు.. పర్షియన్ గల్ఫ్ సముద్రంలోని సొరచేపలకు మీరు రుచికరమైన ఆహారంగా మారిపోతారు' - ఇది ఇరాన్ సైన్యం ఇచ్చిన అల్టిమేటం. ఇది కేవలం బెదిరింపు కాదు.. అమెరికా సైనికుల కోసం ఇరాన్ శవపేటికలను సిద్ధం చేసింది. అసలు ఇరాన్ ఎందుకు ఇంతలా విరుచుకుపడుతోంది..? అమెరికా పంపే ఆ 10 వేల మంది సైనికులకు ఇరాన్ గడ్డపై ఎదురయ్యే ఆ నరకం ఏంటి..? ఈ వీడియోలో ఇరాన్ దమ్ము ఏంటో చూద్దాం.

ఇరాన్ సైన్యంలోని అత్యంత శక్తివంతమైన 'ఖతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్' నుండి ఒక వీడియో బయటకు వచ్చింది. ఇందులో సైనిక ప్రతినిధి జొల్ఫఘారి చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. అమెరికా 10,000 మంది సైనికులను పంపాలని చూస్తోందా..? అయితే వినండి.. 'మీరు ఇక్కడికి రావడం అంటే.. సముద్రపు సొరచేపలకు మిమ్మల్ని ఆహారంగా వేయడమే' అని ఆయన తేల్చి చెప్పారు. ఏ రకంగా అయినా దాడి చేసేందుకు.. శిక్షణ పొందిన 2,500 మంది యూఎస్ మెరైన్లు వచ్చినా.. వారు ఇరాన్ సైన్యం ముందు తేలిపోతారని ఇరాన్ ధీమాగా ఉంది.

ఇరాన్ నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నే టార్గెట్ చేసింది. ట్రంప్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేతిలో ఒక 'కీలుబొమ్మ' అని ఎద్దేవా చేసింది. నెతన్యాహు చెప్పినట్లు వింటూ, అమెరికా సైన్యాన్ని ఒక 'ప్రాణాంతక ట్రాప్'లోకి నెడుతున్నారని హెచ్చరించింది. అమెరికా సైనికుల తల్లులారా.. మీ పిల్లలను ట్రంప్ మృత్యువు నోట్లోకి పంపుతున్నారనే భయంకరమైన సందేశాన్ని ఇరాన్ పంపింది. ఇరాన్ జాతీయ పత్రిక 'టెహ్రాన్ టైమ్స్' ఒక అడుగు ముందుకేసి అమెరికా సైనికుల ఫోటో ప్రచురించి.. పెద్ద అక్షరాలతో 'వెల్‌కమ్ టు హెల్' అని రాసింది.

'ఇరాన్ గడ్డపై అడుగుపెట్టే ప్రతి అమెరికా సైనికుడు తిరిగి వెళ్లేది కేవలం శవపేటికలో మాత్రమే' అని రాసి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. అంటే యుద్ధం మొదలైతే అమెరికాకు ఎదురయ్యేది విజయం కాదు.. వేల సంఖ్యలో శవాలు మాత్రమే అని ఇరాన్ స్పష్టం చేస్తోంది. దాదాపు 3,500 మంది యూఎస్ మెరైన్లు 'యూఎస్ఎస్ ట్రిపోలీ' అనే భారీ యుద్ధ నౌకపై మధ్యప్రాచ్యానికి చేరుకున్నారు. కానీ ఇరాన్ ఈ శక్తిని అసలు లెక్క చేయడం లేదు. "మీరు ఎన్ని నౌకలతో వచ్చినా, ఎంతమంది మెరైన్లను తెచ్చినా.. మా క్షిపణుల ముందు మీరు బలి కావాల్సిందే" అని ఇరాన్ సవాల్ విసురుతోంది.

ఒకవేళ అమెరికా నేరుగా ఇరాన్‌పై దాడికి దిగితే, ఇరాన్ తన మిత్రపక్షమైన యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ను రంగంలోకి దించుతుంది. దీనివల్ల ఎర్ర సముద్రం పూర్తిగా యుద్ధ క్షేత్రంగా మారుతుంది, అమెరికా సరుకు రవాణా నౌకలు ఏవీ సురక్షితంగా ఉండవు. ఇరాన్ సైనిక ప్రతినిధి జొల్ఫఘారి చేస్తున్నవి కేవలం హెచ్చరికలు మాత్రమే కాదు. "అమెరికా సైన్యం నాశనం కావడానికి మేము సెకన్లను లెక్కిస్తున్నాం" అని ప్రకటించారు. అంటే వారు రక్షణ కోసం ఎదురుచూడటం లేదు, అమెరికాపై విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నామని అర్థం.

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్ ఇంకా భయంకరంగా స్పందించారు. 'అమెరికా దళాలు ఎప్పుడు యుద్ధ భూమిలోకి వస్తాయా.. వారిని ఎప్పుడు మంటల్లో తగలబెట్టాలా అని మా సైన్యం ఆకలితో ఉన్న సింహంలా ఎదురుచూస్తోంది' అని ప్రకటించారు. అమెరికాకు సహకరించే ఏ ప్రాంతీయ దేశాన్నైనా సరే శాశ్వతంగా శిక్షిస్తామని ఆయన శపథం చేశారు. ఆక్రమణకు వస్తే అవయవాలు కోల్పోవడం, అవమానకరమైన బందీకరణ తప్ప ఏమీ మిగలదని, ఇది అమెరికాకు ఒక పీడకలగా మిగిలిపోతుందని హెచ్చరించారు. చూశారుగా.. ఇరాన్ మాటల్లో వణుకు లేదు, కేవలం యుద్ధ గర్జన మాత్రమే ఉంది. అమెరికా తన అహంకారంతో ముందడుగు వేస్తుందా? లేక ఇరాన్ హెచ్చరికలకు భయపడి వెనక్కి తగ్గుతుందా? ఏది ఏమైనా పశ్చిమాసియా ఇప్పుడు అగ్నిగుండంలా మారింది.

Published : 
  • 31 March 2026, 12:32 PM IST