తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ దుమారం రేపింది. బీఆర్ఎస్ హయాంలో…ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం కలకలం రేపింది. ఫోన్లు ట్యాపింగ్ చేయడం కాకుండా బడా వ్యాపారులను బెదిరించి…కోట్ల రూపాయలు గుంజారు కొందరు పోలీస్ అధికారులు.
