Top story: శుభకార్యం జరగాలంటే వాళ్లకు డబ్బు ఇవ్వాల్సిందే.!

సమాజంలో హిజ్రాల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. బయటకు చూసేందుకు వీళ్లు కేవలం భిక్షాటన చేస్తూ బతికే వాళ్ళలాగే కనిపించినా.. వాళ్లు పెట్టే టార్చర్ అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కష్టపడి ఇల్లు

Post Published By: dialnews
Updated : 2 September 2026, 5:10 PM IST

సమాజంలో హిజ్రాల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. బయటకు చూసేందుకు వీళ్లు కేవలం భిక్షాటన చేస్తూ బతికే వాళ్ళలాగే కనిపించినా.. వాళ్లు పెట్టే టార్చర్ అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కష్టపడి ఇల్లు కట్టుకుంటే.. సరిగ్గా గృహప్రవేశం రోజు వచ్చి నానా అల్లరి చేస్తారు. శుభమా అని ఇంట్లో పెళ్లి జరిపిస్తే.. పందిట్లో వచ్చి నానా రచ్చ చేస్తారు. వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే శాపనార్ధాలు పెడుతూ నెగిటివ్ వైబ్‌ క్రియేట్ చేస్తారు. వాళ్లు శపిస్తే నిజంగా జరుగుతుందని నమ్మే చాలా మంది అమాయకులు వాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారు. గృహప్రవేశం కావచ్చు.. పెళ్లి కావచ్చు.. కొత్త బిజినెస్ ప్రారంభం కావచ్చు.. చిన్న షాప్ ఓపెనింగ్ కావచ్చు.. ఈవెంట్‌ ఏదైనా సరే వాళ్లకి డబ్బులు ఇవ్వాల్సిందే. ఇవ్వలేదు అంటే ఇక అక్కడ రచ్చ రచ్చే. అందరూ హిజ్రాలు ఇలాగే ఉంటారు అని కాదు కానీ చాలా మంది గ్రూపులు కట్టి మరీ ఇలాంటి దందాలు చేస్తున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఇలాంటి దందాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏరియాలవారీగా ఉండే గ్యాంగ్‌లు.. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి శుభకార్యాలు జరుగుతున్నాయి, ఏదైనా షాప్ ఓపెనింగ్స్ జరుగుతున్నాయా ఇవన్నీ రీసర్చ్ చేసి.. ఏ రోజు ఏ టైం కి ఈవెంట్ ఉంది అనే వివరాలు కనుక్కొని మరీ ఆ సమయానికి కార్యక్రమం దగ్గరికి వెళ్లి రచ్చ రచ్చ చేస్తారు. డబ్బు ఇవ్వకపోతే గోడ మీద ఒక కోడ్‌ నెంబర్‌ రాసి వెళ్లిపోతారు. ఆ కోడ్‌ ఉంటే ఆల్రెడీ ఓ హిజ్రా గ్యాంగ్ అక్కడికి వచ్చారు అని అర్థం. అది చూసి వేరే హిజ్రా గ్యాంగ్‌ అక్కడికి రారు. కోడ్‌ రాసినవాళ్లు మాత్రమే తరువాతైనా వెళ్లి బకాయిలు వసూలు చేసినట్టు డబ్బు అడుగుతుంటారు. ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకపోయినా చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లో మరియు పలు నగరాల్లో హిజ్రాలు చేస్తున్న దందా ఇదే. రీసెంట్‌గా యాంకర్ రవి ఒక పోడ్‌కాస్ట్ స్టూడియో ఓపెన్ చేశాడు. ఆ స్టూడియో ఓపెనింగ్ కి గెస్ట్ గా వెళ్లిన బిగ్‌బాస్ నటి హర్యానా గ్లోరీ.. ఓపెనింగ్ సమయంలో హిజ్రాలు చేసిన రచ్చ గురించి, గతంలో తాను చూసిన కొన్ని సంఘటనల గురించి వీడియో చేసింది.

ఈ వీడియో పై చాలా మంది పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా హిజ్రాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతీ ఒక్కరూ అరియానాకు సపోర్ట్ చేశారు. కేవలం గృహ ప్రవేశాలు పెళ్లిళ్లు మాత్రమే కాదు.. ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఆఖరికి రోడ్‌ మీద సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు ట్రాఫిక్ లో కూడా హిజ్రాల బెడద విపరీతంగా పెరిగిపోతుంది. అంతా చూస్తుండగానే షర్ట్ పట్టుకొని లాగుతారు. అడిగిన డబ్బులు ఇవ్వాలంటూ దబాయిస్తారు. ఇవ్వకపోతే కొందరు దాడి కూడా చేస్తున్నారు. గతంలో ఓ ఇంటి ఓపెనింగ్ కు వెళ్లి వాళ్లు అడిగినంత డబ్బు ఇవ్వలేదని కారణంతో ఓ కుటుంబం పై హిజ్రాల గ్యాంగ్ మొత్తం కలిసి దారుణంగా దాడి చేశారు. అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనంగా మారింది. కానీ ఇలాంటి దాడులు చేస్తున్న హిజ్రాల మీద పోలీసులు తీసుకునే చర్యలు మాత్రం శూన్యం. మరికొన్ని ఏరియాల్లో హిజ్రాలు గ్యాంగ్ ఏర్పడి పలు నేరాలకు కూడా పాల్పడుతున్నారు. ముఖ్యంగా సెక్స్ వర్క్, డ్రగ్స్‌ సరఫరా, చైల్డ్ బెగ్గింగ్ లాంటి మాఫియా వెనక చాలా హిజ్రా ముఠాలు ఉన్నాయి. వీళ్లంతా కలిసి లోకల్ గా ఉండే రౌడీలకు, పెద్దమనుషులు అని చెప్పుకునే సో కాల్డ్ లీడర్లకు హఫ్తాలు చెల్లిస్తారు. ఒకవేళ వీళ్ళు చేసే దండాల వల్ల పోలీసుల నుంచి ఏదైనా ఇబ్బంది ఎదురైతే.. వీళ్ళు హఫ్తా చెల్లించే నాయకుడు వెళ్లి వీళ్ళ తరఫున పోలీసులతో మాట్లాడి ఇష్యూ సెటిల్ చేస్తాడు. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. చాలా ఏళ్లుగా జరుగుతున్న దందా. కానీ ఈ విషయం గురించి ఎవరూ పట్టించుకోరు.

హిజ్రాలు ఇలాంటి దారుణాలు ఎన్ని చేస్తున్న ఎవరు పట్టించుకోకపోవడానికి ఉన్న ఒకే ఒక్క రీజన్.. వాళ్లు భిక్షాటన చేస్తూ బతకడం, వాళ్లకి ఉపాధి అవకాశాలు లేకపోవడం. వాళ్లకు ఉద్యోగాలు రావు, ఎవరూ ఇవ్వరు కాబట్టే బిక్షాటన చేస్తూ బతుకుతున్నారని జాలితో పోలీసులు వీళ్ళ మీద కేసులు పెట్టేందుకు కూడా వెనకాడుతుంటారు. కానీ వాళ్ల భిక్షాటన ఎంత మంది అమాయకులను ఇబ్బందికి గురిచేస్తుందో, ఎంతమంది అమాయకుల చేబులు ఖాళీ చేస్తుందో మాత్రం ఎవరు పట్టించుకోవడంలేదని హిజ్రాల బాధితులు వాపోతున్నారు. చిన్నచిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి పెద్ద విషయాలుగా మాట్లాడే సెలబ్రిటీలు.. ఇలా అన్యాయంగా డబ్బులు వసూలు చేసే హిజ్రాల విషయంలో కూడా మాట్లాడాలని సామాన్యులు కోరుతున్నారు. దాంతోపాటు పోలీసులు కూడా ఇలా డబ్బులు వసూలు చేసే హిజ్రాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ పద్ధతి ఇలాగే కంటిన్యూ అయితే హిజ్రా గ్యాంగ్ ల మధ్యలో సామాన్యులు తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 
  • 2 September 2026, 5:10 PM IST