Rakul Preet, New Business : కొత్త బిజినెస్‌ ప్రారంభించిన రకుల్‌…

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ (Rakul Preet) మరో కొత్త బిజినెస్‌ (New Business) స్టార్ట్‌ చేసింది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ బిజినెస్‌లో రాణిస్తున్న ఆమె.. ఇప్పుడు ఫుడ్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా తన కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 April 2024, 10:30 AM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ (Rakul Preet) మరో కొత్త బిజినెస్‌ (New Business) స్టార్ట్‌ చేసింది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ బిజినెస్‌లో రాణిస్తున్న ఆమె.. ఇప్పుడు ఫుడ్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా తన కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లో 'ఆరంభం' పేరుతో వెజ్‌ రెస్టారెంట్‌ను లాంచ్‌ చేసింది. అందరికీ పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంలో ఈ 'ఆరంభం' రెస్టారెంట్‌ని స్టార్ట్‌ చేసిందట రకుల్‌. దీని ద్వారా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ (Healthy Breakfast), లంచ్‌, డిన్నర్‌ ప్రజలకు అందించబోతోందట. ఈ హోటల్‌లో అన్నీ మిల్లెట్స్‌తో చేసిన వంటకాలే లభించనున్నట్లు చెప్పింది రకుల్‌.

ఇప్పటికే ఫిట్‌నెస్‌ రంగంలో సొంతం వ్యాపారం మొదలు పెట్టిన రకుల్‌కు హెల్త్‌ అండ్‌ స్కిన్‌ బిజినెస్‌లో పెట్టుబడులు ఉన్నాయి. ఫిట్‌నెస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రకుల్‌ సొంతంగా ఎఫ్‌45 పేరుతో జిమ్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. మొదట హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేసిన ఈ బిజినెస్‌ను ఆ తర్వాత ఆమె వైజాగ్‌, ముంబై లోనూ ఎక్స్‌పాండ్‌ చేసింది. ఇక వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. అలాగే న్యూబ్‌ పేరుతో బయోడీగ్రేడబుల్‌, రీ యూజబుల్‌ డైపర్ల బిజినెస్‌ను కూడా 2019లో లాంచ్‌ చేసింది.

ఇప్పుడు తాజాగా ఫుడ్‌ బిజినెస్‌ (Food Business) లోకి అడుగుపెడుతుంది. ఇక రకుల్‌ జోరు చూసి అంతా స్టన్‌ అవుతున్నారు. పెళ్లి తర్వాత ఏదైనా విశేషంతో వస్తుందనుకుంటే.. ఇలా బిజినెస్‌ న్యూస్‌తో వచ్చేసింది అంటున్నారు ఆమె ఫ్యాన్స్‌. మరి ఈ బిజినెస్‌ రకుల్‌కు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం రకుల్‌ ఆరంభం రెస్టారెంట్‌ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో రకుల్‌కి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Published : 
  • 18 April 2024, 10:30 AM IST