Russia: రష్యాకు నిద్రలేకుండా చేస్తున్న డ్రోన్‌దాడులు.. మాస్కోలో వాళ్లనే టార్గెట్ చేశారా ?

తన వరకు వస్తే గానీ నొప్పి తెలియదంటారు.. ! నిజమే.. బుల్లెట్ దించే వాడికంటే.. బుల్లెట్ దిగిన వాడికే పెయిన్ తెలుస్తుంది..వ్యక్తుల మధ్య వైరమైనా.. దేశాల మధ్య యుద్ధమైనా అంతే..! ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్నే తీసుకుందాం..! వారం పదిరోజులు అనుకున్న యుద్ధం కాస్తా.. 463 రోజులకు చేరుకుంది. ప్రతి రోజూ ఉక్రెయిన్ పై రష్యా ఏదో రూపంలో దాడి చేస్తూనే ఉంది. ఒకరకంగా ఉక్రెయిన్ ప్రజలకు బాంబుల మోతతోనే సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతున్నాయని చెప్పాలి. నెలల తరబడి సాగుతున్న యుద్ధానికి ఉక్రెయిన్ ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. లక్షలాది మంది జీవితాలు సర్వనాశనమైనా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయినా.. నగరాలకు నగరాలు రూపు రేఖలు మారిపోయినా.. రష్యా ఉక్రెయిన్‌పై బాంబు వర్షం కురిపిస్తూనే ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 1 June 2023, 4:21 PM IST

Published : 
  • 1 June 2023, 4:21 PM IST

Exit mobile version