ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచులో 8 పరుగులు మాత్రమే చేసినా.. అతడు మాత్రం రికార్డులు బ్రేక్ చేశాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 500 రన్స్ చేసిన ప్లేయర్‌గా అతడు నిలిచాడు. ఇదే సమయంలో ఐపీఎల్లో 500 రన్స్ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగానూ 15 ఏళ్ల వైభవ్ రికార్డు క్రియేట్ చేశాడు.ఐపీఎల్లో 15 ఏళ్ల 26 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ.. 500 రన్స్ పూర్తి చేసుకున్నాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ ఒక్క ప్లేయర్ కూడా 15 ఏళ్లలో ఈ ఫీట్ సాధించలేదు.
గతంలో పృథ్వీ షా 19 ఏళ్ల 14 రోజులు, సంజూ శాంసన్ 19 ఏళ్ల 195 రోజులు, రిషభ్ పంత్ 19 ఏళ్ల 220 రోజులు, ఇషాన్ కిషన్ 19 ఏళ్ల 295 రోజుల్లో ఈ ఘనత సాధించారు. ఇదే సమయంలో ఐపీఎల్లో అత్యంత వేగంగా 500 రన్స్ చేసిన ప్లేయర్‌గానూ వైభవ్ నిలిచాడు. వైభవ్ కేవలం 227 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు.గతంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 260 బంతుల్లో 500 పరుగులు చేశాడు.
ఇక ప్రియాన్ష్ ఆర్యా 278 బంతులు, వీరేంద్ర సెహ్వాగ్ 280 బంతులు , నమన్ ధీర్ 283 బంతుల్లో ఈ ఫీట్ పూర్తి చేశారు.కాగా ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో 7 మ్యాచులలో 254 పరుగులు చేశాడు. 220కి పైగా స్ట్రైక్ రేట్‌తో అతడు ఈ రన్స్ స్కోరు చేశాడు. అత్యధిక స్కోరు 78గా ఉంది. ఈ ఐపీఎల్లో అతడు 20 సిక్స్‌లు, 26 ఫోర్లు కొట్టాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగో ప్లేసులో ఉన్నాడు. కాగా ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ టాప్-5లో కొనసాగుతున్నాడు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (247 పరుగులు) కంటే వైభవ్ ముందున్నాడు. బుమ్రా, హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో సైతం ఈజీగా సిక్స్‌లు బాదేశాడు.