టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌కు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే టూర్‌కు దూరమైన అతను.. ఏషియన్ గేమ్స్ జట్టులోనూ స్థానంలో కోల్పోనున్నట్లు క్రీడా వర్గాలు అంటున్నాయి. గత నెలలో భారత సెలెక్టర్లు 15 మంది సభ్యుల ఏషియన్ గేమ్స్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సంజూ శాంసన్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ జట్టు నుంచి కూడా సంజూను తప్పించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.యువ ఆటగాళ్లకు అవకాశాల పేరుతో సంజూ టీ20 కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టాలని కొందరు బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విషయంలో బీసీసీఐపై భారీ ఒత్తిడి ఉందని, అతడికి అవకాశాలు ఇవ్వడం కోసమే సంజూను శాశ్వతంగా తప్పించే ప్లాన్ జరుగుతుందని అతని అభిమానులు అనుకుంటున్నారు.కాగా, ఐర్లాండ్ సిరీస్, ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయలేదు. విశ్రాంతి పేరుతో సెలెక్టర్లు అతన్ని తప్పించారన్న ప్రచారం జరుగుతుంది.ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఆడిన మూడు టీ20 మ్యాచ్‌ల్లో శాంసన్ ఆరు పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.
ఈ క్రమంలోనే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వైపు మొగ్గు చూపిన సెలెక్టర్లు.. శాంసన్‌ను పక్కన పెట్టారు. అతని స్థానంలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్సిమ్రాన్ సింగ్‌ను బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా జట్టులోకి తీసుకున్నారు.. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఏషియన్ గేమ్స్ విషయానికొస్తే.. ఈ ఖండాంతరం క్రీడలు సెప్టెంబర్ 19- అక్టోబర్ 4 మధ్యలో జరుగనున్నాయి.