ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం, వరల్డ్ బెస్ట్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మధ్యలోనే అతను ఈ సంచలన నిర్ణయాన్ని అనౌన్స్ చేశాడు. అయితే స్టోక్స్ కేవలం మానసిక ఒత్తిడి వల్లే తప్పుకున్నాడని పైకి చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెట్టిన తీవ్రమైన ప్రెజర్ ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా జట్టులోకి స్టోక్స్ తీసుకొచ్చిన కొన్ని 'అలవాట్లు' బోర్డుకు అస్సలు నచ్చలేదట.. ఇంతకీ ఏంటా వివాదం..? ఈ రిటైర్మెంట్ వెనుక ఉన్న డార్క్ సీక్రెట్ ఏంటి..?
బెన్ స్టోక్స్ కెప్టెన్ అయినప్పటి నుండి ఇంగ్లాండ్ జట్టు 'బాజ్‌బాల్' పేరుతో మైదానంలో ఎంత దూకుడుగా ఆడిందో, మైదానం బయట కూడా అంతే లైఫ్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. బెన్ స్టోక్స్ లీడర్‌షిప్‌లో జట్టులోకి 'బీర్ కల్చర్', 'లేట్ నైట్ పార్టీ కల్చర్' మరియు 'వెప్ కల్చర్' విపరీతంగా పెరిగిపోయాయని క్రికెట్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. గెలిచినా, ఓడినా అర్ధరాత్రి దాటాక కూడా ప్లేయర్స్ నైట్‌క్లబ్‌లలో తిరగడం, మద్యం సేవించడం వంటి పరిణామాలు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెద్దలకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి.
ఈ పార్టీ కల్చర్ కాస్తా ఇటీవల లండన్‌లోని ఒక నైట్‌క్లబ్‌లో జరిగిన గొడవతో పీక్స్‌కు చేరింది. న్యూజిలాండ్‌తో మొదటి టెస్ట్ గెలిచిన ఆనందంలో స్టోక్స్, గస్ అట్కిన్సన్ బోర్డు విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూ రూల్‌ను బ్రేక్ చేసి నైట్‌క్లబ్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఒక ఘర్షణలో ఈసీబీ సెక్యూరిటీ సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఇన్సిడెంట్ను ఇంగ్లాండ్ బోర్డు చాలా సీరియస్‌గా తీసుకుంది. క్రమశిక్షణా చర్యల కింద కెప్టెన్ అని కూడా చూడకుండా బెన్ స్టోక్స్‌ను రెండో టెస్ట్ మ్యాచ్ నుండి తప్పించింది. అంతేకాదు, టీంలో ఆల్కహాల్‌ను పూర్తిగా బ్యాన్ చేయాలని డైరెక్టర్ రాబ్ కీ గట్టిగా ప్లాన్ చేశారు.
మూడో టెస్ట్‌కు స్టోక్స్ జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ, బోర్డు నుండి అతనికి ఎలాంటి పబ్లిక్ సపోర్ట్ లభించలేదు. దాంతో బోర్డు వ్యవహరించిన తీరుపై స్టోక్స్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. "ఇక నాలో పోరాడే ఓపిక లేదు" అంటూ తన భార్యతో చెప్పి మరీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించేశాడు. అయితే ఇంగ్లాండ్ మీడియా మాత్రం.. బోర్డు తనపై పెడుతున్న రూల్స్, పార్టీ కల్చర్‌పై వ్యూహాత్మకంగా తీసుకుంటున్న చర్యలకు నిరసనగా.. స్టోక్స్ బోర్డుకు ఒక రకమైన 'ఫక్ యూ' అనే రీతిలో ఈ అర్థాంతర రిటైర్మెంట్ నిర్ణయంతో షాక్ ఇచ్చాడని విశ్లేషిస్తోంది. 15 ఏళ్ల అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్, రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఒక గొప్ప లెజెండ్ కెరీర్.. ఇలా నైట్‌క్లబ్ వివాదాలు, బోర్డుతో గొడవల వల్ల ముగిసిపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌ను నిజంగానే కలచివేస్తోంది.