చెన్నైకి బిగ్ షాక్… జట్టును వీడిన స్టార్ పేసర్…!

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 5 ఓటములతో 12 పాయింట్లతో లీగ్ టేబుల్లో 5వ స్థానంలో కొనసాగుతుంది. మిగిలిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది

Post Published By: dialnews
Updated : 15 May 2026, 3:30 PM IST

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 5 ఓటములతో 12 పాయింట్లతో లీగ్ టేబుల్లో 5వ స్థానంలో కొనసాగుతుంది. మిగిలిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. 3 గెలిస్తే టాప్ 2లో నిలిచే ఛాన్స్ ఉంది. అయితే పంజాబ్ కింగ్స్‌తో కీలక పోరుకు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్న జెమీ ఓవర్టన్ గాయం కారణంగా ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊహించని షాక్ అని చెప్పొచ్చు. లోయర్ ఆర్డర్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు వికెట్లు కూడా తీస్తూ సీఎస్కేకు నమ్మకమైన ఆల్ రౌండర్‌గా ఓవర్టన్ మారాడు.ఇప్పటి వరకు 10 మ్యాచ్‌ల్లో 136 పరుగులు చేశాడు. సగటు 34.. స్ట్రయిక్ రేట్ 158. ఇక బౌలింగ్‌లోనూ ఓవర్టన్ అదరగొట్టడాడు.

10 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. అయితే తొడ కండరాల గాయం కారణంగా ఓవర్టన్ అర్ధాంతరంగా ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి సీఎస్కే ఎక్స్‌లో ట్వీట్ కూడా పెట్టింది. ఓవర్టన్ కుడి తొడకు గాయమైంది. దాంతో అతడు టెస్టుల కోసం ఇంగ్లండ్ వెళ్లాడంటూ ట్వీట్ వేసింది.ఐపీఎల్ కీలక దశకు చేరిన సమయంలో ఇలా జరగడం సీఎస్కేకు తీరని లోటని చెప్పాలి. ఆర్సీబీ కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా గాయం కారణంగా ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోవడంతో ఆర్సీబీ ఓపెనింగ్ వీక్‌గా మారింది. ఇప్పుడు జెమీ ఓవర్టన్ వెళ్లిపోవడంతో సీఎస్కే బౌలింగ్ కాస్త వీక్‌గా మారే అవకాశం ఉంది.

ఓవర్టన్ కోలుకొని.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పెట్టే ఫిట్ నెస్ టెస్టులో పాస్ అయితేనే అతడికి ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి లభిస్తుంది. అయితే ఐపీఎల్ మరో 2 వారాల్లో ముగియనుంది. మే 25 నాటికి లీగ్ స్టేజ్ ముగుస్తుంది. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించినా ఓవర్టన్ మరో 10 రోజుల్లో ఫిట్ నెస్ సాధించాల్సి ఉంటుంది. పేసర్ తొడకండరాల గాయం నుంచి కోలుకోవడం అంత సులభం కాదు. కనీసం 2 నుంచి 4 వారాలకు పైగా సమయం పడుతుంది.చూస్తుంటే ఈ సీజన్‌కు ఓవర్టన్ ఆట పూర్తయినట్లే. మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను ప్లే ఆఫ్స్ ముంగిట కోల్పోవడం ఏ జట్టుకైనా నష్టమే. ప్రస్తుతం ఓవర్టన్‌కు రీప్లేస్ మెంట్ అయితే సీఎస్కే ప్రకటించలేదు. మిగిలిన ప్లేయర్లతోనే ఆడే అవకాశం ఉంది.

Published : 
  • 15 May 2026, 3:30 PM IST