పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం… రిషబ్ పంత్ పై వేటు ?

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. రిష‌బ్ పంత్ సార‌థ్యంలో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడిన ఆ జ‌ట్టు కేవ‌లం నాలుగు అంటే నాలుగే మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది.

Post Published By: dialnews
Updated : 25 May 2026, 12:05 PM IST

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. రిష‌బ్ పంత్ సార‌థ్యంలో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడిన ఆ జ‌ట్టు కేవ‌లం నాలుగు అంటే నాలుగే మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో 10 మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోయింది. 8 పాయింట్ల‌తో అట్ట‌డుగు స్థానంతో సీజ‌న్‌ను ముగించింది.ఇదిలా ఉంటే.. కెప్టెన్‌గానే కాకుండా బ్యాట‌ర్‌గానూ రిష‌బ్ పంత్ తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. 14 మ్యాచ్‌ల్లో 28.36 స‌గటు, 138.05 స్ట్రైక్‌రేటుతో 312 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచ‌రీ ఉంది. ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పంత్‌ను వేలంలో 27 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది.

లీగ్‌లో అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా రిష‌బ్ పంత్ నిలిచాడు. కేఎల్ రాహుల్ త‌రువాత సార‌థ్య బాధ్య‌త‌ల‌ను అందుకున్న పంతో రెండు సీజ‌న్ల‌లోనూ కెప్టెన్ గా ఘోరం విఫ‌లం అయ్యాడు. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ల‌క్నో జ‌ట్టు ఏడో స్థానంతో ముగించ‌గా ఈ సారి దారుణంగా అట్ట‌డుగు స్థానంతో నిలిచింది. ఈ క్ర‌మంలో అత‌డిపై వేటు త‌ప్ప‌దు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.దీనిపైనే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ డైరెక్ట‌ర్ క్రికెట్ టామ్ మూడీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఎవ‌రిని నేరుగా నిందించ‌క‌పోయిన‌ప్ప‌టికి ఫ్రాంచైజీ మొత్తం నిర్మాణాన్ని పునఃసమీక్షిస్తున్నట్లుగా చెప్పారు. కెప్టెన్సీ పరంగా చూస్తే.. పంత్ దీన్ని సవాలుగా భావించాడని ఫలితాలు కూడా అదే ప్రతిబింబిస్తున్నాయని తెలిపాడు.

నాయ‌క‌త్వ ఒత్తిడి పంత్ బ్యాటింగ్ శైలిపై ప్ర‌భావం చూపుతోందా అనే విష‌యం ఆలోచించాల్సి ఉంద‌న్నాడు. ఈ సీజన్ మాకు చాలా కష్టంగా గడిచిందని దీనిపై పునరాలోచిస్తామన్నాడు, సమయం తీసుకుని, అన్ని విషయాలను రివ్యూ చేస్తామన్నాడు.మూవీ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే.. పంత్ ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అదే స‌మయంలో అత‌డిని ఆట‌గాడిగా కొన‌సాగిస్తుందా? లేదా అన్న‌ది ప్ర‌స్తుతానికి పెద్ద ప్ర‌శ్న‌గానే ఉంది. రాబోయే కొద్ది నెలల్లో దీనిపై స్ప‌ష్టత రావొచ్చు. గతంలో కెఎల్ రాహుల్ సారథిగా వైఫల్యం చెందినప్పుడు ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా బహిరంగానే ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాతే రాహుల్ లక్నో ఫ్రాంచైజీని వదిలేసి ఢిల్లీకి వెళ్లిపోయాడు.

Published : 
  • 25 May 2026, 12:05 PM IST