సారథిగా అదే చివరి సిరీస్ సూర్యాభాయ్ కు డేంజర్ బెల్స్…!

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026‌లో టీమిండియాను విజేతగా నిలబెట్టిన ఈ ముంబై ఆటగాడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు వార్తలు

Post Published By: dialnews
Updated : 16 April 2026, 12:50 PM IST

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026‌లో టీమిండియాను విజేతగా నిలబెట్టిన ఈ ముంబై ఆటగాడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను సూర్య ఛాంపియన్ గా నిలబెట్టాడు. తద్వారా మూడు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన జట్టుగా.. సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకున్న టీమ్‌గా టీమిండియా చరిత్ర సృష్టించింది.వాస్తవానికి ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై పుకార్లు వచ్చాయి. కెప్టెన్‌గా టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించినప్పటికీ.. బ్యాటర్‌గా అతను దారుణంగా విఫలమయ్యాడు. మెగా టోర్నీలోనూ అతని బ్యాట్ నుంచి ఆశించిన పరుగులు రాలేదు.మెగా టోర్నీ విజయానంతరం సూర్య రిటైర్ అవుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను కొట్టిపారేసిన సూర్య.. 2028 ఒలింపిక్స్ ఆడటమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. అయితే టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తుంది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత సూర్యను కెప్టెన్‌గా తప్పించే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

ఒకప్పుడు వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన సూర్యకుమార్ యాదవ్.. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది అతని స్ట్రైక్‌రేట్ 120లోపే పడిపోగా.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ ఏడాది నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన సూర్య.. పసికూన అమెరికాపై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాపై 18, వెస్టిండీస్‌పై 18, సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 11, ఫైనల్లో న్యూజిలాండ్‌పై డకౌటై తీవ్రంగా నిరాశపర్చాడు.ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ సూర్య ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లండ్‌లో సూర్య బ్యాటింగ్ ప్రదర్శన ఆధారంగా అతని కెప్టెన్సీ భవిత్యం ఆధారపడి ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

ఇంగ్లండ్ పర్యటనలో సూర్యనే కెప్టెన్ అనీ, అయితే బ్యాటర్‌గా అతను నిలకడగా రాణించాల్సి ఉందనీ బోర్డు అధికారి ఒకరు చెప్పారుయ. 2028 నాటికి అతను జట్టుతో కొనసాగాలంటే కచ్చితంగా మెరుగైన ప్రదర్శనలు ఇవ్వాల్సిందేననీ సదరు బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే టీ20 ఫార్మాట్‌లో ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటి నెలకొంది. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే వంటి కుర్రాళ్లు సంచలన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌తో పాటు సారధిగా దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే సూర్య మెరుగైన ప్రదర్శన చేయాలని లేకుంటే కెప్టెన్సీతో పాటు జట్టులోనూ చోటు గల్లంతవుతుందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Published : 
  • 16 April 2026, 12:50 PM IST