అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ.. వైభవ్ మొదటగా ఎవరికి చెప్పాడో తెలుసా ?

అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన అరంగేట్రం తర్వాత సోషల్ మీడియా వేదికగా తొలి పోస్ట్ చేశాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. అంతకు ముందు ఐర్లాండ్ జట్టుతో జరిగిన రెండు టీ20

Post Published By: dialnews
Updated : 6 July 2026, 8:30 PM IST

అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన అరంగేట్రం తర్వాత సోషల్ మీడియా వేదికగా తొలి పోస్ట్ చేశాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. అంతకు ముందు ఐర్లాండ్ జట్టుతో జరిగిన రెండు టీ20ల్లో, ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎట్టకేలకు మాంచెస్టర్ మ్యాచ్‌లో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వైభవ్ తన తొలి అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసినప్పటికీ.. వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చర్చనీయాంశంగా మారింది.

సచిన్ టెండూల్కర్, షఫాలీ వర్మల రికార్డులను బద్ధలు కొడుతూ భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ టీమిండియా జెర్సీలో ఉన్న తన ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చూస్తూ.. తన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు, జట్టు సభ్యులకు, సీనియర్ ఆటగాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.

అందరి నుంచి వస్తున్న సందేశాలు చూసి చాలా ఆనందంగా ఉందినీ, .తనపై ఎల్లప్పుడూ ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశం రావడం పట్ల ఎంతో కృతజ్ఞుడనై ఉన్నానంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రతిసారీ జట్టు కోసం రాణించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాననీ వైభవ్ పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ సాధించిన ఈ రికార్డుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వైభవ్ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్యాప్ అందుకున్న వెంటనే ముందుగా నాన్నకే చెప్పాననీ తెలిపాడు. నాన్న చాలా సంతోషించారనీ, ఒత్తిడి గురించి ఆలోచించొద్దన్నారు. ఇప్పటివరకు ఎలా ఆడావో అలాగే నీ ఆటను నమ్ముకుని కొనసాగాలని సూచించారని వైభవ్ తెలిపాడు.

Published : 
  • 6 July 2026, 8:30 PM IST