కుర్రోడి మీద మాటల కొరడా…!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ వర్గాల్లో వేడి మొదలైంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశంగా

Post Published By: dialnews
Updated : 17 March 2026, 4:50 PM IST

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ వర్గాల్లో వేడి మొదలైంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశంగా మారాయి. గత సీజన్‌లో తన మెరుపులతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ యంగ్ బ్యాటర్‌కు ఉతప్ప ఒక గట్టి హెచ్చరికను జారీ చేశాడు.గత ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విజయంలో ప్రతిభతో పాటు కొంతవరకు అదృష్టం కూడా తోడైందని ఉతప్ప విశ్లేషించాడు.

"క్రికెట్‌లో ప్రారంభంలో అదృష్టం కలిసి రావచ్చు, కానీ అది ఎల్లకాలం ఉండదు" అని ఆయన స్పష్టం చేశాడు. కొత్తగా జట్టులోకి వచ్చినప్పుడు ప్రత్యర్థి జట్లకు సదరు ఆటగాడి బలహీనతలు తెలియకపోవడం వైభవ్‌కు కలిసొచ్చిందని ఆయన అభిప్రాయపడ్డాడు. వచ్చే సీజన్‌లో వైభవ్‌కు పరిస్థితులు అంత సులభంగా ఉండబోవని ఉతప్ప హెచ్చరించారు. దానికి గల ప్రధాన కారణాలను ఆయన ఉతప్ప వివరించాడు. ఇప్పటికే ప్రత్యర్థి జట్లు వైభవ్ బ్యాటింగ్ శైలిని, అతని షాట్ సెలెక్షన్‌ను క్షుణ్ణంగా విశ్లేషించి ఉంటారు. అతన్ని ఎలా అవుట్ చేయాలి? ఏ బంతులకు అతను ఇబ్బంది పడుతున్నాడు? అనే అంశాలపై బౌలర్లు పక్కా ప్లాన్‌తో వస్తారు. గత సీజన్ ప్రదర్శన వల్ల ఈసారి అభిమానుల అంచనాలు భారీగా ఉంటాయి.

ఆ అంచనాలను అందుకోవడంలో ఒత్తిడి పెరగడం సహజం. కొత్తదనం తగ్గిన తర్వాతే ఏ ఆటగాడికైనా నిజమైన పరీక్ష మొదలవుతుంది. ఈ సీజన్‌లో వైభవ్ ఎదుర్కోబోయే సవాలు అదేననేది రాబిన్ సారాంశం. రాబిన్ ఉతప్ప మాటల సారాంశం ప్రకారం.. వైభవ్ తన ప్రతిభను కేవలం ఒక సీజన్‌కే పరిమితం చేయకుండా, ఈసారి కూడా స్థిరంగా రాణించాల్సి ఉంటుంది. అలా ఆడితేనే అతను ఒక గొప్ప ఆటగాడిగా గుర్తింపు పొందుతాడని ఉతప్ప పేర్కొన్నాడు. తన టెక్నిక్‌ను మెరుగుపరుచుకుంటూ, బౌలర్ల వ్యూహాలను తిప్పికొడితేనే వైభవ్ భవిష్యత్తులో స్టార్ క్రికెటర్‌గా ఎదిగే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ అభిమానులు మాత్రం తమ 'వండర్ కిడ్' వైభవ్ ఈసారి కూడా సిక్సర్లతో హోరెత్తిస్తాడని నమ్ముతున్నారు. మరి ఉతప్ప హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని వైభవ్ సూర్యవంశీ ఈ 2026 సీజన్‌లో తన సత్తా చాటుతాడో లేదో వేచి చూడాలి.

Published : 
  • 17 March 2026, 4:50 PM IST