ఐపీఎల్ 2027 సీజన్లో హార్ధిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ తరపున ఆడడం అసాధ్యమని తేలిపోయింది. 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు పర్ఫామెన్స్తో తీవ్రంగా నిరాశ చెందిన హార్ధిక్ పాండ్యా, జట్టు మారబోతున్నట్టుగా హింట్ ఇచ్చేశాడు. హార్ధిక్ పాండ్యా కోసం ఏకంగా ఏడు ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందులో అతను గతంలో ఆడిన గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ఉంది. హార్ధిక్ పాండ్యా కూడా మళ్లీ తన పాత జట్టుకి ఆడాలని ఆశపడ్డాడనీ సమాచారం. అయితే గుజరాత్ టైటాన్స్ జట్టు మాత్రం హార్ధిక్ పాండ్యా ట్రేడ్‌ని రిజెక్ట్ చేసిందనీ తెలిసింది.ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా, మొదటి సీజన్లోనే టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్, వరుసగా రెండో సీజన్లో ఫైనల్ చేరింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రావడంతో హార్ధిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ జట్టును వీడాడు.
ఐపీఎల్ 2024 సీజన్ నుంచి 2026 వరకూ హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ముంబై ఇండియన్స్‌కి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ బాధ్యతలు హార్ధిక్ పాండ్యాకు ఇవ్వడంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రోహిత్ శర్మ భార్య రితికాతో పాటు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రిత్ బుమ్రా వంటి ప్లేయర్లు... నేరుగా ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ ప్లేయర్ల నుంచి హార్ధిక్ పాండ్యాకి ఏ మాత్రం సహకారం దక్కలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఏ మాత్రం సరిగా లేదని క్లియర్‌గా కనిపించింది. ముంబై ఇండియన్స్ జట్టులో రెండు గ్రూపులు ఏర్పడ్డాయని కూడా కొంతమంది మాజీలు కామెంట్లు చేశారు. ఇన్ని పరిణామాల మధ్య ముంబై ఇండియన్స్ జట్టు నుంచి బయటికి రావాలని హార్ధిక్ పాండ్యా నిర్ణయించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
హార్ధిక్ పాండ్యా కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ జట్లతో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా ఆసక్తి చూపించింది. అయితే తిరిగి వస్తే, తనకి మళ్లీ కెప్టెన్సీ కావాలని కోరాడట హార్ధిక్ పాండ్యా. హార్ధిక్ జట్టుని వీడిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్ కూడా ఆడింది.
ఈ సమయంలో కెప్టెన్సీ మార్చడానికి గుజరాత్ టైటాన్స్ జట్టు సిద్ధంగా లేదట. ఒకవేళ హార్ధిక్ పాండ్యాకు తిరిగి కెప్టెన్సీ ఇవ్వాల్సి వస్తే, తాను వేరే జట్టుకి వెళ్తానని శుభ్‌మన్ గిల్ తెలిపాడట. దీంతో టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని గుజరాత్ టైటాన్స్ నిర్ణయించుకుంది. కెప్టెన్సీ ఇస్తేనే తిరిగి వస్తానని షరతు పెట్టిన హార్ధిక్ పాండ్యా ట్రేడ్‌ని తిరస్కరించిందని సోషల్ మీడిాయలో వార్తలు వస్తున్నాయి.