IND vs SA Series: భారత్‌తో సిరీస్‌కు బవుమా అవుట్.. సౌతాఫ్రిక జట్టు ప్రకటన

వన్డే, టీ20 జట్లకు ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేసిన ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో రెండు జట్ల మధ్య మూడు టీ20లు , మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

Post Published By: narender Thiru
Updated : 4 December 2023, 7:13 PM IST

IND vs SA Series: డిసెంబర్‌ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు భారత్‌తో జరిగే మూడు ఫార్మాట్ల సిరీస్‌ల కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా ఇవాళ జట్లను ప్రకటించింది. సౌతాఫ్రికా సెలెక్టర్లు పరిమిత ఓవర్ల జట్ల నుంచి రెగ్యులర్‌ కెప్టెన్‌ టెంబా బవుమా, స్టార్‌ పేసర్‌ కగిసో రబాడను తప్పించారు. వన్డే, టీ20 జట్లకు ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తైలవాస్ బోణీ..

ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేసిన ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో రెండు జట్ల మధ్య మూడు టీ20లు , మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌, ఆ తర్వాత వన్డే, టెస్ట్‌ సిరీస్‌లు జరుగుతాయి. తొలి టీ20 డిసెంబర్ 10న డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో జరగనుంది. డిసెంబర్ 12న రెండవ టీ20 సెయింట్ జార్జ్ పార్క్‌లో జరగనుండగా, చివరి టీ20 డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరగనుంది. మూడు టీ20లు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతాయి.

 

Published : 
  • 4 December 2023, 7:13 PM IST