ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయింది.ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో దారుణ ఆటతీరుతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ముంబై ఆడిన గత రెండు మ్యాచ్‌లకు వెన్నునొప్పి గాయంతో పాండ్యా దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు పాండ్యా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలని అతడిని జట్టు నుంచి తప్పించారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే పాండ్యా తన ప్రాక్టీస్‌లో బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ కసితీరా బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నంతసేపు పాండ్యాకు ఏమాత్రం అసౌకర్యంగా కనిపించలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మహేల జయవర్దనే మాత్రం పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు. అంతేకాదు పాండ్యా త్వరగా కోలుకునేందుకు తమ మెడికల్ టీం ప్రయత్నాలు చేస్తుందని తెలిపాడు.పాండ్యా పూర్తిగా కోలుకునేంతవరకు రిస్క్ చేయకూడదని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. పాండ్యా తాను ఫిట్‌గా ఉన్నట్లు ఒకవైపు వీడియో రిలీజ్ చేయడం, అదే సమయంలో జయవర్దనే పాండ్యా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పడం చూస్తుంటే పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలనే జట్టు నుంచి తప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పాండ్యా కూడా తన అగ్రెసివ్ ప్రవర్తనతో జట్టులో పూర్తిగా నెగెటివిటీని మూటగట్టుకోవడం కూడా అతడికి ప్రతికూలంగా మారిందని చెప్పొచ్చు. ఇటీవలే పాండ్యా.. ముంబై ఇండియన్స్ ప్రాంచైజీని అన్‌ఫాలో చేయడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఇదే విషయమై ముంబై ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి ఈ సీజన్లో పాండ్యా ముంబై తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడని, వచ్చే సీజన్లో వేరే జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. పాండ్యా జట్టులోకి రావడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదనీ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ కేవలం ఆరు పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. ముంబై తన తర్వాతి మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది.