IPL 2024 : రసవత్తరంగా పర్పుల్ క్యాప్ రేస్…

ఐపీఎల్ 17 వ సీజన్ పర్పుల్ క్యాప్ రేస్ రసవత్తరంగా సాగుతోంది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తర్వాత టాప్ లో ఎలాంటి మార్పులు జరగలేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 May 2024, 3:50 PM IST

ఐపీఎల్ 17 వ సీజన్ పర్పుల్ క్యాప్ రేస్ రసవత్తరంగా సాగుతోంది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తర్వాత టాప్ లో ఎలాంటి మార్పులు జరగలేదు. బుమ్రా 18 వికెట్లతో టాప్ లో కొనసాగుతుండగా.. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ 17 వికెట్లతో రెండో స్థానంలో, కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి 16 వికెట్లతో మూడో స్థానంలో, సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ 15 వికెట్లతో నాలుగో స్థానంలో, అర్ష్‌దీప్ సింగ్ 15 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 14 వికెట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. రాయల్స్ తో మ్యాచ్ లో కుల్దీప్.. 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసాడు. ఇక ముంబై, పంజాబ్ కూడా ప్లేఆఫ్స్ పై దాదాపు ఆశలు వదిలేసుకున్న వేళ టాప్ లో ఉన్న బుమ్రా, హర్షల్ పటేల్ స్థానాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

Published : 
  • 8 May 2024, 3:50 PM IST