నన్ను భయపెట్టింది అతడే భారత పేసర్ పై మాక్స్ వెల్

ప్రపంచ క్రికెట్ లో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ అంటే విధ్వంసకర బ్యాటింగ్ కు కేరాఫ్ అడ్రస్... ఎలాంటి బౌలర్ నైనా వీరబాదుడు బాదేస్తాడు. అలాంటి మాక్స్ వెల్ కూడా ఒక బౌలర్ కు భయపడ్డాడు.

Post Published By: Vencateshg
Updated : 29 October 2024, 5:58 PM IST

ప్రపంచ క్రికెట్ లో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ అంటే విధ్వంసకర బ్యాటింగ్ కు కేరాఫ్ అడ్రస్... ఎలాంటి బౌలర్ నైనా వీరబాదుడు బాదేస్తాడు. అలాంటి మాక్స్ వెల్ కూడా ఒక బౌలర్ కు భయపడ్డాడు. ఆ బౌలర్ ఎవరో కాదు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రానే... ఈ విషయాన్ని మాక్స్ వెల్ స్వయంగా చెప్పాడు. స్లో బాల్స్, యార్కర్లతో నమ్మశక్యం కాని విధంగా బౌలింగ్ చేస్తాడని ప్రశంసించాడు. తాను ఎదుర్కొన్న బెస్ట్ బౌలర్ బూమ్రానేనని చెప్పాడు. వరల్డ్ క్రికెట్ లో తాను భయపడిన బౌలర్ గా బూమ్రా పేరునే మాక్సీ చెప్పాడు. బూమ్రా,మాక్స్ వెల్ 15సార్లు తలపడగా... ఏడుసార్లు ఔటయ్యాడు. తీవ్ర ఒత్తిడిలోనూ డాట్ బాల్స్ వేయగల సత్తా అతనికే మాత్రమే ఉందంటూ మాక్స్ వెల్ కితాబిచ్చాడు.

Published : 
  • 29 October 2024, 5:58 PM IST