దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ రింకూసింగ్ కు సెలక్టర్ల పిలుపు

దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌కు బీసీసీఐ జట్లను ప్రకటించింది. బంగ్లాతో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలోని తమ జట్లను వీడనుండటంతో పలు మార్పులు తప్పలేదు.

Post Published By: Vencateshg
Updated : 10 September 2024, 3:32 PM IST

దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌కు బీసీసీఐ జట్లను ప్రకటించింది. బంగ్లాతో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలోని తమ జట్లను వీడనుండటంతో పలు మార్పులు తప్పలేదు. అయితే బంగ్లాతో మొదటి టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికైనప్పటికీ, అతను దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌ ఆడతాడని బీసీసీఐ తెలిపింది. ఇక స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఈ దేశవాళీ టోర్నీకి ఎంపికయ్యాడు. ఆంధ్రా రంజీ జట్టు నుంచి షేక్ రషీద్ చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే శుభ్‌మన్ గిల్ స్థానంలో ఇండియా ఏ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. బ్యాటర్‌గా గిల్ స్థానంలో ప్రథమ్ సింగ్ ఎంపికయ్యాడు. దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్ లు సెప్టెంబర్ 12 నుంచి మొదలవుతాయి.

Published : 
  • 10 September 2024, 3:32 PM IST