ఢిల్లీ గూటికి రిషబ్ పంత్…కుల్దీప్ తో లక్నో ట్రేడ్ డీల్..!

ఐపీఎల్‌-2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య భారీ ట్రేడ్ డీల్ జరిగింది. ఈ డీల్‌ ప్రకారం.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రెండేళ్ల తర్వాత మళ్లీ తన పాత ఫ్రాంచైజీకి ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చేశాడు

Post Published By: dialnews
Updated : 24 June 2026, 6:37 PM IST

ఐపీఎల్‌-2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య భారీ ట్రేడ్ డీల్ జరిగింది. ఈ డీల్‌ ప్రకారం.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రెండేళ్ల తర్వాత మళ్లీ తన పాత ఫ్రాంచైజీకి ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చేశాడు, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జాయింట్స్ జట్టులోకి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ అధికారికంగా ధ్రువీకరించింది. పంత్ కు తన ధరను 12 కోట్లు తగ్గించుకుని 15 కోట్లకే ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో పంత్‌ను రూ.27 కోట్ల రికార్డు ధ‌ర‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ల‌క్నో ఫ్రాంచైజీ అత‌డిపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. కానీ అత‌డు మాత్రం ల‌క్నో యాజ‌మాన్యం అంచ‌నాలను అందుకోలేక‌పోయాడు.

వ‌రుసగా 2025, 2026 సీజన్లలో లక్నో కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేక పట్టికలో ఆఖరి స్ధానాలకు పరిమితమైంది. రిష‌బ్ వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా కూడా తీవ్ర నిరాశ‌ప‌రిచాడు.సీజన్ ఆరంభంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా రిషభ్ పంత్‌ను మందలించడం కూడా కనిపించింది. ఆ జట్టు మేనేజ్‌మెంట్‌తో విభేదాలు తలెత్తడంతోనే పంత్ తిరిగి ఢిల్లీ గూటికి చేరినట్లు తెలుస్తోంది. పంతే స్వయంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని ప్రకటించింది.2016 నుంచి 2024 వరకు రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ జట్టుకు సారథిగా కూడా వ్యవహరించాడు.

ఆ టీమ్ తరఫున 111 మ్యాచ్‌లు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా అతను రికార్డు సాధించాడు. 2021-2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా వ్యవహరించాడు. రిషభ్ పంత్ రీఎంట్రీని ఢిల్లీ ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ఇంత భారీ పేకట్‌తో ట్రేడ్‌ అయిన ప్లేయర్‌ మరొకరు లేరు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన ఐదేళ్ల బంధానికి కుల్దీప్‌ వీడ్కోలు పలకనున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కుల్దీప్‌ను 13.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. అదే ధరతో అతడు లక్నో తరపున ఆడనున్నాడు. ఢిల్లీ తరపున కుల్దీప్‌ 65 మ్యాచ్‌లలో 72 వికెట్లు పడగొట్టాడు.

Published : 
  • 24 June 2026, 6:37 PM IST