స్పెయిన్ దే సాకర్.. ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనాపై విజయం..!

వరుసగా రెండో సారి వరల్డ్ కప్ గెలవాలనుకున్న అర్జెంటీనా ఆశలు నెరవేరలేదు. ఫైనల్లో స్పెయిన్ 1-0 గోల్స్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించింది.న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్‌లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్

Post Published By: dialnews
Updated : 20 July 2026, 12:11 PM IST

వరుసగా రెండో సారి వరల్డ్ కప్ గెలవాలనుకున్న అర్జెంటీనా ఆశలు నెరవేరలేదు. ఫైనల్లో స్పెయిన్ 1-0 గోల్స్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించింది.న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్‌లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి.దీంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. ఆ తర్వాత 106వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు ఫెర్రాన్ టొర్రెస్ అద్భుతమైన గోల్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. స్పెయిన్ కు ఇది రెండో ప్రపంచ కప్ టైటిల్. గతంలో 2010లో గెలిచింది. ఊహించినట్టుగానే మరోసారి అద్భుతమైనటికి-టాకా వ్యూహంతోనే స్పెయిన్ పై చేయి సాధించింది.మ్యాచ్ ఆద్యంతం స్పెయిన్ బంతిని తమ ఆధీనంలో ఉంచుకుంటూ  అర్జెంటీనాను ఒత్తిడికి గురిచేశారు. దాదాపు 20 షాట్లతో స్పెయిన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

అర్జెంటీనా ఆటగాళ్లకు బంతిని ఎక్కువసేపు దక్కనివ్వకుండా అద్భుతమైన పాసింగ్ గేమ్‌ను ప్రదర్శించింది.లియోనెల్ మెస్సీని కట్టడి చేయడంలో సక్సెస్ అయింది.స్పెయిన్ డిఫెండర్లు మెస్సీని సమర్థవంతంగా అడ్డుకున్నారు. దీనివల్ల మెస్సీకి చాలా తక్కువ అవకాశాలు లభించాయి.టోర్నీ అంతటా స్పెయిన్ రక్షణ విభాగం చాలా పటిష్టంగా పనిచేసింది. ప్రత్యర్థులకు గోల్స్ చేసే అవకాశాలను చాలా వరకు అడ్డుకున్నారు. ఫైనల్లో కూడా స్పెయిన్ డిఫెన్స్ కారణంగానే గెలిచింది. అర్జెంటీనా ఎంత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా స్పెయిన్ డిఫెన్స్ ను చేధించలేకపోయారు. చివర్లో ఫెర్రాన్ టోరెస్ హీరోయిజం హైలైట్ గా నిలిచింది.

నిర్ణీత సమయంలో ఏ జట్టు గోల్ చేయలేకపోవడంతో 106వ నిమిషంలో  ఫెర్రాన్ టోరెస్ కొట్టిన ఏకైక గోల్ స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.ఈ మ్యాచ్ లో.అర్జెంటీనా పొరపాట్లు ఓటమికి కారణమయ్యాయి. స్పెయిన్ చేసిన నిరంతర దాడులను అడ్డుకోవడంలో అర్జెంటీనా డిఫెన్స్ చివరి వరకు ఒత్తిడిని తట్టుకోలేకపోయింది.ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్ కు గురై మైదానం వీడటంతో, స్పెయిన్ ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంది. అదనపు సమయంలో అర్జెంటీనా పది మందితోనే ఆడాల్సి రావడం కొంపముంచింది.గత యూరో 2024  విజయంతో ఊపుమీదున్న స్పెయిన్.. అదే సమష్టి తత్వంతో, ఎలాంటి తడబాటు లేకుండా ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది.

Published : 
  • 20 July 2026, 12:11 PM IST