వాడికి అంత సీన్ లేదు… ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై సూర్యకుమార్…!

పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్పై సోషల్ మీడియాలో పెను దుమారం రేగడం.. తారిక్ బౌలింగ్ చేస్తున్న తీరుపై కొందరు బహిరంగ విమర్శలు చేస్తుండటంతో ఈ విషయం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది.

Post Published By: dialnews
Updated : 15 February 2026, 6:47 PM IST

పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్పై సోషల్ మీడియాలో పెను దుమారం రేగడం.. తారిక్ బౌలింగ్ చేస్తున్న తీరుపై కొందరు బహిరంగ విమర్శలు చేస్తుండటంతో ఈ విషయం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. తారిక్ బౌలింగ్ స్టైల్ ను ఎలా ఎదుర్కొనబోతున్నారంటూ టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే.. ఈ ప్రశ్నకు సూర్య చాలా కూల్గా సమాధానం ఇచ్చాడు. కొన్నిసార్లు ఎగ్జామ్స్లో ఔట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయని.. అలా అని ఆ ప్రశ్నలను వదిలేయలేమని సూర్య చెప్పాడు. సొల్యూషన్ కోసం కొత్తగా ఆలోచించాలని.. మీకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలని.. ఆ ప్రకారం హ్యాండిల్ చేయాలని.. ఇప్పుడు తాము కూడా అదే చేస్తామని చెప్పాడు.

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చాలా భిన్నంగా ఉండొచ్చని.. అలా అని అతని బౌలింగ్కు తాము లొంగిపోయే ప్రసక్తే లేదని సూర్య కుండబద్ధలు కొట్టాడు. అలాంటి బౌలర్లు.. అలాంటి బౌలింగ్ యాక్షన్స్ ఎదుర్కొనేందుకు తాము ఇప్పటికే ప్రాక్టీస్ చేశామని.. ఎలా ఎదుర్కోవాలో అలానే ఎదుర్కొంటామని సూర్య కుమార్ యాదవ్ మీడియాకు తెలిపాడు.ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ను ప్రాక్టీస్ చేయడం హైలెట్ గా నిలింది. అభిషేక్ శర్మ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా సూర్యకుమార్ ఇలా బౌలింగ్ చేశాడు.

ఈ పాక్ బౌలర్ బౌలింగ్ యాక్షన్ కొత్తగా అనిపించొచ్చనీ , కానీ టీమిండియా బ్యాటర్లు ఆ బౌలింగ్ యాక్షన్ను అర్థం చేసుకుని భారీ షాట్లు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు పాక్ టీం.. ఉస్మాన్ తారిక్పై భారీగానే ఆశలు పెట్టుకుంది. కాగా తన ప్రత్యేకమైన స్టాప్- అండ్-పాజ్ సైడ్ ఆర్మ్ యాక్షన్‌తో ఈ ఆఫ్ స్పిన్నర్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. కాగా, ఇప్పటి వరకు నాలుగు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తారిక్ 11 వికెట్లు తీసుకున్నాడు. ఓవర్‌కు ఆరు పరుగుల కంటే తక్కువ ఎకానమీ రేట్‌తో రాణిస్తున్నాడు. మొత్తంగా 42 టీ20 మ్యాచ్‌ల్లో 70 వికెట్లు తీసాడు.

Published : 
  • 15 February 2026, 6:47 PM IST