Suryakumar Yadav: బొంబాయి సూర్య.. మంగళూరు భార్య.. సూర్య బర్త్ డే నేడు..!

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా వెలుగొందుతున్న సూర్యకుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో 200 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో నాలుగు సార్లు యాభై ప్లస్ స్కోర్లు చేసిన ఏకైక బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్.

Post Published By: narender Thiru
Updated : 14 September 2023, 6:08 PM IST

Suryakumar Yadav: టీమిండియా స్టార్ బ్యాటర్‌, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ ఈరోజు సెప్టెంబర్ 14న తన 33వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా వెలుగొందుతున్న సూర్యకుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో 200 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో నాలుగు సార్లు యాభై ప్లస్ స్కోర్లు చేసిన ఏకైక బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్.

2023లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన అతను ఈ అరుదైన ఘనత సాధించాడు. ట్వంటీ-20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా కూడా సూర్య రికార్డ్స్ నెలకొల్పాడు. సూర్య మొత్తం ఈ ఫార్మాట్‌లో 3 సెంచరీలు చేసాడు. ఒక ఏడాదిలో అత్యధిక టీ20 అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన ఆటగాడు కూడా అతనే. మొత్తం 68 సిక్సర్లు కొట్టాడు సూర్య. ఇక.. సూర్య ప్రేమకథ విషయానికి వస్తే, అతను జూలై 2016లో దేవిషా శెట్టిని వివాహం చేసుకున్నాడు. విశేషమేమిటంటే వీరిద్దరూ కాలేజీలో ప్రేమించుకున్నారు. సూర్య.. దేవిషాకు ప్రపోజ్‌ చేయడం, ఆమె కూడా అంగీకరించడం, ఇరువైపుల పెద్దలు కూడా ఆశీర్వాదం తెలపడంతో పెళ్లిపీటలెక్కారీ లవ్ బర్డ్స్.

Published : 
  • 14 September 2023, 6:08 PM IST