టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి KKR, CSK, SRH లేదా పాత జట్టు గుజరాత్ టైటాన్స్‌కు వెళ్తున్నాడని వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. గుజరాత్ జట్టు అతడిని తిరిగి తీసుకోవడానికి సిద్ధమైనప్పటికీ... హార్దిక్ "కెప్టెన్సీ" షరతు విధించడంతో, మేనేజ్మెంట్ దానికి అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను హార్దిక్ పాండ్యా ప్రతినిధి ఖండించారు.
"హార్దిక్ ఇప్పటివరకు ఏ ఇతర ఫ్రాంచైజీతోనూ చర్చలు జరపలేదు. ముంబై ఇండియన్స్ కూడా ఎవరితోనూ ట్రేడింగ్ సంప్రదింపులు జరపలేదు. ఏదైనా ఉంటే హార్దిక్ ముంబై యాజమాన్యానికే ముందు చెప్తాడు. కాబట్టి అనవసరమైన ఊహాగానాలకు తావివ్వద్దు." అని స్పష్టం చేశారు.